రూ. 98 వేల కోట్లపై అనుమానాలెన్నో..? Questions araise over Rs 9806 crore deposits in punjab..?

Questions araise over rs 9806 crore deposits in punjab

Taxi driver Balwinder Singh, Jan Dhan account, State Bank of Patiala, Barnala, freak, taxi driver, Rs 98 billion, Rs 9806 crores, Pradhan Mantri Jan Dhan Yojana, punjab

Questions araise over Rs 98 billion deposits in Taxi driver Balwinder Singh jan dhan account at barnala branch of State Bank of Patiala

రూ. 9 వేల కోట్లపై అనుమానాలెన్నో..?

Posted: 11/30/2016 03:26 PM IST
Questions araise over rs 9806 crore deposits in punjab

దేశం నుంచి అవినీతినీ, నల్లధనాన్ని తరిమి కొట్టేందుకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి అనేక అరోపణలు వెల్లువెత్తినా.. కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వం మాత్రం అరోపణలపై అసలు స్పందించనే లేదు. పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ నవండర్ 8న చేసే ప్రకటనకు సరిగ్గా కొన్ని గంటల ముందు బీజేపి పశ్చిమ బెంగాల్ శాఖ తన అకౌంట్లో వేసిన మూడు కోట్ల రూపాయల తాలుకు రశీదు సోషల్ మీడియాలో వైరల్ గా మారినా దానిపై అయన స్పందించలేదు.

సామాజిక మాద్యమాల ద్వారా నిత్యం తన ఫాలోవర్లతో అందుబాటులో వుంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రధాని.. అదే సోషల్ మీడియా ద్వారా నల్లధనంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్న ప్రధాని.. అరోపణలపై మౌనముద్ర వీడటం లేదు. ఇక ప్రతిపక్షాలపై మాత్రం వారు అవినీతి నిర్మూలణను, నలధనానికి వేసే అడ్డుకట్టను అడ్డుకుంటున్నారని అరోఫణలు గుప్పిస్తూనే.. వారిని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు.

ఈ నేపథ్యంలో సరిగ్గా ప్రధాని పెద్దనోట్ల ప్రకటనకు నాలుగు రోజుల ముందు పంజాబ్ లోని బర్నాలకు చెందిన టాక్సీ డ్రైవర్ బల్విందర్ సింగ్ అకౌంట్లోకి వచ్చి చేరిన 9 వేల 806 కోట్ల రూపాయలు జమకావడం.. మళ్లీ అంతే వేగంగా ఉపసంహరణకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టాక్సీ డ్రైవర్ బల్విందర్ సింగ్ కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో  ప్రధానమంత్రి జనధన యోజన కింద ఒక అకౌంటు వుంది.

అయితే అందులో వున్న రమారమి మూడు వేల రూపాయలకు తోడుగా ఈ నెల 4న ఏకంగా 98,05,95,12,231.00 డబ్బు జమైంది. అది చూసి సంబ్రమాశ్చారానికి లోనైన టాక్సీ డ్రైవర్ కు తెలియకుండానే వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే పోయింది. దీనిపై బ్యాంకు అధికారులను విచారించగా, వారు ఏకంగా ఆయన సాస్ బుక్ ను కూడా తీసుకుని.. కొత్త పాస్ బుక్ ఇచ్చారు. అదేమని అడిగితే వివరం చెప్పకుండానే వెనక్కు పంపారు.
 
లీడ్ బ్యాంకు మేనేజర్ సందీప్ గార్గ్ మాత్రం దీనిపై వివరణ ఇచ్చారు. అతడి అకౌంటులోకి రూ. 200 క్రెడిట్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్ పొరపాటున బ్యాంకుకు చెందిన 11 అంకెల ఇంటర్నల్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటు నంబర్ కూడా వేసేశారని, అందువల్ల ఆ మొత్తం వచ్చినట్లు కనిపించిందని చెప్పారు. మర్నాడు ఈ తప్పును తెలుసుకుని మళ్లీ సరిచేశామని వివరించారు. నిజానికి లీడ్ బ్యాంకు మేనేజర్ వాదన సరైనదే అయితే ఏదో చిన్న పోరబాటు జరిగిందని బ్యాంకు అధికారులు సర్థిచెప్పకుండా పాస్ బుక్ ను తీసుకోవడమే అసలు అనుమానాలకు తావిస్తుంది.

పెద్దనోట్ల ప్రకటనకు సరిగ్గా 4 రోజుల ముందే ఇంత పెద్ద మొత్తం నగదు బదిలీ కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ముందస్తుగా సమాచారం లీక్ కావడంతోనే ఈ మొత్తం బ్యాంకు నుంచి బల్విందర్ సింగ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ అయ్యిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే బల్విందర్ సింగ్ బ్యాంకుకు వెళ్లకుండానే అయన అకౌంట్ లోకి డబ్బు ఎలా ట్రాన్స్ ఫర్ అయ్యింది..? అకౌంట్ నెంబర్ కు బదులు బ్యాంకు జనరల్ లెడ్జర్ నెంబర్ ఎలా వేస్తారు..? అలా వేస్తే సిస్టమ్ ఎలా సమ్మతిస్తుంది..? ఎరర్ అని చూపించకపోవడంపై అనుమానాలు.? ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలావుండే పలువురు మాత్రం ఇది రాజకీయ పార్టీలకు చెందిన సొమ్మని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా వారికి సమాచారం లీక్ సదరు డబ్బును అకౌంట్లలో జమచేస్తున్నారని అరోపణలు కూడా వస్తున్నాయి. అందుకనే బ్యాంకు అధికారులు సదరు అకౌంట్ దారుడు బల్విందర్ సింగ్ పాస్ బుక్ ను కూడా లాక్కుని కొత్త పాస్ బుక్ ఇచ్చారని కూడా అరోపణలు గుప్పు మంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్నా అధికారులే నిజానిజాలను వెలికితీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taxi driver  Balwinder Singh  Jan Dhan account  State Bank of Patiala  Barnala  punjab  

Other Articles