ఈరోజు ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా బాద్యతలు చేపట్టిన వెంకయ్య నాయుడు తన ఛేంబర్ లో ఈ సందర్భంగా విచ్చేసిన తన కుటుంబ సభ్యుల సమక్షంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
దేశంలో 7935 పట్టణాలున్నాయని, దేశ జనాభాలో 43 శాతానికి పైగా నగరాల్లో నివసిస్తున్నారని, మెట్రోలలో, పట్టణాలలో రోజురోజుకీ జనాభా పెరిగిపోతున్నారని, అందువలన వారికి మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ అభివృద్ధికీ పాటుపడతానని చెప్పారు.
ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టివిలు వచ్చిన నేపథ్యంలో స్మార్ట్ సిటీలు కూడా ఆధునిక నగరవాసులకు అవసరమే మరి. ఈ స్మార్ట్ సిటీల వలన నగరాలు, పట్టణాలలో ప్రస్తుతమున్న జనాభా కొంత తగ్గే అవకాశం ఉంది. దాని వలన మౌలిక వసతులను పెంపొందించటమే కాకుండా నగరాల మధ్య రవాణా సేవలకు కూడా ఎక్కువ అవకాశం లభిస్తుంది. రవాణా సౌకర్యవంతంగా ఉంటే దూరం ప్రయాణం చెయ్యటంలో ఇబ్బంది వుండదు. దాని వలన నగరవాసమే చెయ్యనవసరం లేని స్థితి ఏర్పడుతుంది.
వెంకయ్యనాయుడు చేసిన వాగ్దానాలలో, 2020 నాటికి అందరికీ పక్కాఇళ్ళు, అనేకానేక శాటిలైట్ టౌన్ షిప్ లు ఉన్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more