సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తోసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విమర్శించారు. విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో హుదూద్ తుఫాను బారిన పడిన రైతులను, ప్రజలను ఆయన పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు.
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more