30 years of telugu desam party

Telugu Desam Party, nandamuri taraka ramarao,party founded by Dr N T Rama Rao on March 29th, 1982, Telugu Desam Party Completed 30 Years

30 Years of Telugu Desam Party

Telugu Desam Party.gif

Posted: 01/09/2013 07:13 PM IST
30 years of telugu desam party

30 Years of Telugu Desam Party

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోటను  కేవలం 9 నెలల్లోనే  ఒక్క తెలుగోడి దెబ్బతో నేలమట్టం అయింది.  ఢిల్లీ నాయకులకు వెన్నులో  వణుకు పుట్టిన తెలుగు నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)  అప్పటి వరకు  కాంగ్రెస్ పాలనలో  ఇందిరా గాంధీ కంబంధ హస్తం క్రింత తెలుగు వారు నలిగిపోతున్న రోజులవి?   తెలుగు వారికి స్వేచ్చ కోసం, తెలుగు వారి అభివ్రుద్ది  కోసం, తెలుగు రైతుల కోసం, నిమ్మగడ్డ నట సింహ నడుం బిగించాడు.  అప్పటి వరకు  రాష్ట్రంలో  ప్రాంతీయ పార్టీలు లేవు.  జాతీయ పార్టీ అయిన  కాంగ్రెసే పార్టీకి   నందమూరి  తారక రామారావు  9నెలల్లో తెలుగు వారి సత్తా ఏమిటో చూపించి, ఇందిరా గాంధీ కంటిలో  నలుసుగా మారిపోయాడు.  ఎప్పుడు ఓటమి చవిచూడాని  ఇందిరా గాంధీకి  ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో  చిత్తుగా ఓడిపోవటం  ఇందిరా గాంధీకి  మింగుడుపడలేదు.   అప్పటి వరకు  ఎన్నికైన ముఖ్యమంత్రుల  అందరు  ఢిల్లీ  రాజ్ భవన్ లో  ప్రమాణ స్వీకరం చేసేవారు. కానీ  తెలుగు ప్రజల చేత  ఎన్నుకొబడిన నాయకుడిగా, మొట్ట మొదటి సారి  లాల్ బహుదూర్ స్టేడియంలో  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరం చేసి  తెలుగు జాతి సత్తా ఏమిటో   ఢిల్లీ నాయకులకు చూపించారు.  అంతేకాకుండా  లోక్ సభలో  తెలుగు రాష్ట్రం నుండి  30 మంది ఎంపీలతో  వెళ్లి కాంగ్రెస్ పార్టీకి  ప్రతిక్ష హోదో కూర్చున్న నాయకుడుగా ఎన్టీఆర్ ప్రపంచనికి తెలుగోడి గొప్పతనం ఏమిటో  సాటి చెప్పాడు. 1983లో అధికారంలో  ఎన్టీఆర్  రాష్ట్రంలోని  అన్ని మతలను, కులలాను,  ఒక తాటి పైకి తెచ్చి, తన విజయ బాటకు సోపనం వేసుకున్నారు.  కుల, మత బేధాలు  రాజకీయ పార్టీలో లేవు అని చెప్పి నాయకుడు ఎన్టీఆర్.  ఆయన తీసుకున్న నిర్ణయం  రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని  కోరుకుంటారు.  ఆ నిర్ణయం వలన  పార్టీకి నష్టం  వస్తుందని తెలిసిన, ఆయన తెలుగు ప్రజల వైపే మొగ్గు చూపుతారు. తెలంగాణలో పటేల్ వ్యవస్థు రద్దు చేసిన ఘనట ఎన్టీఆర్ దే.  ఒకనోక  సమయంలో  ఈనాడు మొదటి పేజీలో   రూ. 227 కోట్లు రాష్ట్రం  లాస్ లో ఉందని ప్రకటించింది.  ఆ విషయం తెలుసుకున్న  ఎన్టీఆర్  ఎంతో రహస్యంగా ఉండవలసి రాష్ట్ర బడ్జెట్  విషయాలు  బయటకు లీక్  అవ్వటంత  ఆయన సహించలేకపోయారు. వెంటనే  కేబినేట్   మొత్తం చేత రాజీనామాలు చేయించి, కొత్త కేబినేట్ ఏర్పాటు చేసిన కొత్త చరిత్ర స్రుష్టించారు.

30 Years of Telugu Desam Party

దీంతో  ఆయన పై అనేక విమర్శలు  రావటం  జరిగింది. అయిన  ఆయన దేనికి భయపడకుండా  ముందుకు  సాగిపోయాడు.    ఎన్టీఆర్   ప్రజా నాయకుడుగా ఎదగటానికి కారణం, తెలుగు వారికి  కూడు...గుడ్డ.. ఇల్లు  ప్రతి పేదవాడికి అందించారు.  ముఖ్యంగా రైతుల పాలిట దేవుడు.  అన్నదాతకు  వెన్నుగా నిలిసిన నాయకుడు  నందమూరి తారక రామారావు ఒక్కరే.  రైతాన్న  బాగుంటే  రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి.  ఒక సంవత్సరానికి  రైతులకు  కరెంట్  ఛార్జీ  కేవలం 50 చెల్లించే విధంగా ఆలోచన చేసిన నాయకుడు ఎన్టీఆర్. 1984 లో అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ మరణం.  దేశం ప్రజలపై ఆమె ప్రభావం బాగా చూపాయి.  1983 నుండి చక్రం తిప్పిన   ఎన్టీఆర్ కు 1989లో  బ్రేక్ పడింది.   1989 లో  ఏర్పడ్డ  కేంద్ర ప్రభుత్వానికి  బిన్నద్రువాల  లైప్ట్- రైట్ లు ఒకేసారి  మద్దతు ఇవ్వటంలో ఎన్టీఆర్ ఆవిరల క్రుషి చేశారు. నేషషల్ ఫ్రంట్  చైర్మన్ గా వి.పి.  సింగ్ సపోర్టు చేశారు. 1994లో  ఎన్నికల్లో అధికారంలోకి  రాగానే మధ్యపాన  నిషేదంపై తొలి సంతకం చేశారు.  మధ్యపాన  నిషేదం  తెలుగులోగిళ్ళలో  నిజమైన సంక్రాంతి  తెచ్చిందని చెప్పవచ్చు. మాట ఇస్తే  దానిని నేరవేర్చేందుకు ఎన్టీఆర్  తహతహలాడేవారు.  రాష్ట్రం రాజకీయ చరిత్రలో  ఎన్నడూ  లేని విధంగా  1994 ఎన్నికల్లో 26 సీట్లకు  దిగజారిన  కాంగ్రెస్ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.  1994-1995ల మద్య  ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో   చోటుచేసుకున్న  పలు వివాదాస్పద అంశాలను పక్కన పెడితే  తెలుగువారికి విశ్వవ్యాప్త కీర్తి వచ్చేందుకు కారకుడు  ఎన్టీఆర్.    ఈ మధ్యలో  తన చిరకాల స్వప్నం  సామ్రాట్  అశోక్  చిత్ర నిర్మాణం జరిగింది. ఆయన చిట్టచివరి  చిత్రం  మేజర్  చంద్రకాంత్ లో నటించారు.  మూడు దశాబ్ధాల సుదీర్ఘ  ప్రస్తానంలో  అనేక  మిట్లపల్లాలు చవిచూసిన తెలుగుదేశం.  ఇప్పుడు  తెలుగుదేశం పరిస్థితి నాలుగు రోడ్ల మద్యలో ఉంది. 

30 Years of Telugu Desam Party

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles