Highest waterfall in the world

angel falls, highest waterfall, highest falls, tallest waterfall, Waterfalls, Canaima, Venezuela, Nature, Travel

The Natives in Venezuela had known about the "Salto Angel" since the beginning of time. Then United States pilot Jimmie Angel was flying over the area in 1935 when he landed on the top of a lone mountain in search of gold.

Highest Waterfall in the World.GIF

Posted: 01/21/2012 04:47 PM IST
Highest waterfall in the world

Highest_Waterfall_in_the_World
Angel-Fallsనింగినుంచి నేలపై జారిపోతున్న నీటి ధారలు. స్వచ్ఛమైన జలాలు. దేవతలకి ఇష్టమైన జలపాతాలు. అవే ఏంజెల్ ఫాల్స్. జలపాతాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏంజెల్‌ఫాల్స్‌కు పోటీనే కావు. ఇవి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయి మరి. ప్రపంచంలోనే ఎత్తయిన జలపాతాలుగా ఇవి ఎప్పుడో చరిత్రకెక్కేశాయి. మరి వీటి గురించి కొన్ని విశేషాలు....చుట్టూ దట్టమైన అడవి. మధ్యలో ఓ పేద్ద కొండ. దానిపై 3212 అడుగుల ఎత్తు నుంచి నీరు చెంగు చెంగుమంటూ కిందికి దూకుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆ అందాలన్నీ ఏంజెల్ ఫాల్స్ సొంతం. ప్రపంచంలోనే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న జలపాతాలు ఇవే మరి. వెనెజులాలోని బొలివర్ రాష్ట్రంలో ఈ జలపాతాలున్నాయి. వీటిని స్థానికులు దేవతలకిష్టమైన జలాలుగా భావిస్తారు. ఇవి ఆకాశంలోంచి వచ్చే పవిత్ర జలాలు అని వారి నమ్మకం. 1937లో అమెరికాకు చెందిన జిమ్మి ఏంజెల్ అనే పైలట్ చెప్పే వరకూ వీటి గురించి మిగతా ప్రపంచానికి తెలియదు. ఒకరోజు జిమ్మి ఫ్లయిట్‌లో ప్రయాణిస్తూ వీటిని గమనించాడు. చాలా ఎత్తులో ఉన్నట్లుగా గుర్తించి లోకానికి చెప్పడంతో దీని గురించి అందరికీ తెలిసింది. దాంతో ఈ జలపాతాలను ఇతడి పేరుతోనే ఏంజెల్ ఫాల్స్‌గా పిలవడం ప్రారంభించారు.విశేషాలు : 3212 అడుగుల ఎత్తు నుంచి దుమికే ఈ జలపాతాలు 2640 అడుగుల దూరం వరకూ ఎటువంటి అవాంతరాలు లేకుండా నేరుగా భూమ్మీద పడతాయి. - నయాగరా జలపాతాల కంటే వీటి ఎత్తు ఇరవై రెట్లకు పైనే. - ఈ జలాలు కిందికి పడే ప్రాంతంలో వెడల్పు 500 అడుగులుపైనే ఉంటుంది. - వర్షాకాలంలో ఇవి రెండు జలపాతాలుగా చీలిపోతాయి. - ప్రపంచంలోనే ఎత్తయిన జలపాతాలైన వీటిని చూడాలంటే కష్టపడి అడవిలో పాదయాత్ర చేయాల్సిందే. లేదంటే హెలికాప్టర్ తో ఈ జలపాతాలు దుమికే కొండపై వాలిపోవచ్చు. - వర్షాకాలంలో ఈ జలపాతాలు చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మూడు వేల అడుగుల ఎత్తులోంచి నీరు కిందికి దూకడంవల్ల నీటి ఆవిరి మంచుగా మారి రెండు కిలోమీటర్ల పరిధిలో కప్పేస్తుంది. దీంతో అదో మంచులోకంగా అనిపిస్తుంది. - యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఇవి ఎప్పుడో చేరిపోయాయి. - సాహసవంతులు ఈ కొండను ఎక్కడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chowmahalla palace
Stephen hawking history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles