Shri subramanya swami special article

shri subramanya swami, sree subramanya swamy temple, sri subramanya swamy temple, madura, tiruchendur sri subrahmanya swami, tiruchendur sri subrahmanya swami devasthanam

shri Subramanya swami special article

ముక్కోటి దేవతలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు

Posted: 05/18/2013 04:16 PM IST
Shri subramanya swami special article

మంచి సంతానం కావాలని , ఏదైనా దీర్ఘకాలిక చర్మ వ్యాధి బాధిస్తుంటే , అది త్వరగా నయం కావాలని , కోరునున్న వారితో వివాహం జరగాలని , వైవాహిక జీవితం ఆనందమయం గా సాగిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ? ఈ కోరికలన్నీ తీరాలి , దీనికి ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధించాలి అని అడిగితె , పండితుల దగ్గరినుండి , ఇంట్లో పెద్దవారి వరకు , అందరు సూచించేది , సుబ్రమణ్య స్వామిని ఆరాదిన్చామనే . ప్రతీ మంగళవారం , సుబ్రమణ్య స్వామీ ఆలయాన్ని దర్శించి , దీపం వెలిగించి , మన కోరిక చెప్తే , ఆ స్వామీ తప్పక మన మోర ఆలకిస్తాడు అనేది అనాదిగా వస్తోన్న నమ్మకం . శివాలయం లో తప్పని సరిగా సుబ్రమణ్య స్వామీ ప్రతిమ అయినా ఉంటుంది . శివుని కుమారుడు , కుమారా స్వామీ ఇంకో అవతారం గా , తండ్రికే జ్ఞ్యాన బోధన చేసిన తనయుడిగా , సుబ్రమణ్య స్వామీ , ముక్కోటి దేవతలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు .

స్వామీ వారి ఆలయం ఇందాక చెప్పుకున్నట్లు గా , ప్రతీ శివాలయం లో తప్పని సరిగా ఉంటుంది . లేదా చిన్న ప్రతిమ అయినా ఉంటుంది . నాగెంద్రుడినే సుబ్రమణ్య స్వామీ గా భావించి పూజించమని కూడా కొందరు సూచిస్తారు . అయితే , సుబ్రమణ్య స్వామిని తమిళులు ప్రత్యేకంగా , తమ కుల దైవం గా , ఆరాధిస్తారు . అసలు మన రాష్ట్రం లో శివాలయాలు యెంత విరివిగా అయితే ఉన్నాయో , తమిళనాడు లో సుబ్రమణ్య స్వామీ ఆలయాలు కూడా అంతే . అన్నీ కాకపోయినా , ఈ ఆలయాల్లో ముఖ్యమైన వాటిని అన్వేషిద్దాం ;

సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. ఎందుకంటె , సాధారణంగా , సుబ్రమణ్య స్వామీ నిలబడి ఉన్నట్టు గానే ప్రతిమ ఉంటుంది కాబట్టి .

ఇక తండ్రికే ఉపదేశం చేసిన తనయుడిగా సుబ్రమణ్య స్వామిని మనం అభివర్నిస్తాం కదా , మరి ఈ స్వామీ , సాక్ష్యాత్ ఆ పరమసివునికి గ్న్యానోపదేశం చేసిన ప్రదేశం ఎక్కడో తెలుసా ? కుంభకోణం . స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.

కేవలం తమిళ నాడు లో నే కాదు , మన ఆంద్ర ప్రదేశ్ లో కూడా , సుబ్రమణ్య స్వామీ ఆలయాలు కొలువుదీరి ఉన్నాయి . హైదరాబాద్ - సికందరాబాద్ ప్రాంతం లో ఉన్న 'స్కందగిరీ' అని పిలవబడే సుబ్రమణ్య స్వామీ ఆలయం లో ఇతర ఏ ఆలయానికీ తగ్గకుండా , స్వామీ వారిని పూజిస్తారు . ప్రత్యెక పూజలు సైతం నిర్వహిస్తారు .

ఇంకో అత్యంత విశిష్టత కలిగిన ఆలయం , తిరుమల క్షేత్రం వెంకటేశ్వర భక్తులకు యెంత ప్రత్యేకమో , సుబ్రమణ్య స్వామిని ఆరాధించే వారికి ఫళని అన్నా అంతే . తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles