స్పితి లోయ వినడానికి కొత్తగా వినిపిస్తున్న ఈ ప్రదేశం... మనదేశానికి ఉత్తర సరిహద్దులో చైనా, టిబెట్ పొలిమేరల్లో ఉంది. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. హిమాలయ సానువుల్లో విస్తరించిన ప్రదేశం ఇది. ఈ లోయతోపాటు ఇక్కడ ప్రవహిస్తున్న నది కూడా అదే పేరుతో స్పితి నదిగా వాడుకలోకి వచ్చేసింది. బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం ఇది. ఇక్కడ బౌద్ధలామాలు తిరుగాడుతుంటారు. ఆ ప్రాంతం యొక్క విశేషాలు తెలుసుకుందాం.
పర్వతసానువుల్లో క్లిష్టమైన మలుపులు దాటుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడ మనుషులు నివసించడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతుంది. ఇంతలో కాషాయధారులైన బౌద్ధసన్యానులు కనిపిస్తారు. కొండదారుల్లో నడవడం దినచర్య కావడంతో వాళ్లు ఏ మాత్రం తొట్రుపడకుండా ఒకరి వెనుక ఒకరుగా క్రమశిక్షణతో సాగిపోతుంటారు. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే...బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలుగా అనిపిస్తాయి. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అంటే మొదటగా గుర్తొచ్చేవి సిమ్లా, కులు, మనాలి. కులు లోయ నుంచి స్పితిలోయకు దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో హిమపర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఈ పర్యటనలో ఆకర్షించే మరో ప్రదేశం బారా సిగ్రి గ్లేసియర్. రొహటాంగ్ పాస్ దాటి 20 కి.మీ.లు ప్రయాణిస్తే గ్రంఫూ గ్రామం వస్తుంది. ఇక్కడి కుడి వైపున బారా సిగ్రి గ్లేసియర్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన హిమనదాల్లో రెండవది. కుంజుంమ్ కనుమ శిఖరం మీద దుర్గామాత ఆలయం ఉంటుంది. ఈ శిఖరం నుంచి ఎటు చూసినా ప్రకృతి కనువిందు చేస్తుంటుంది.
ఇక్కడి నుంచి కుంజుంమ్ పాస్‌కి ముఖద్వారంగా ఉన్న రొహటాంగ్ పాస్ని చూసేసి, లోసార్‌లో సరదాగా జడల బర్రెలు, గుర్రాల మీద సవారీ చేసి డల్హౌసీ చేరుకుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇది బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ హయాంలో కాత్లాగ్, పోట్రేయస్, తెహ్రా, బక్రోటా, బలున్ అనే ఐదు కొండల మీద నిర్మితమైన నివాస ప్రదేశం. మధ్యయుగం నాటి నిర్మాణశైలిలో ఉన్న చర్చిలు, దేవదారు, పైన్ వృక్షాలు, రంగుల పూలతో అందమైన ఉద్యానవనాన్ని తలపిస్తుంది.భారత్‌లోనే పర్యటిస్తున్నామా లేక పొరపాటున సరిహద్దు దాటేసి టిబెట్‌లోకి అడుగు పెట్టామా అన్నంత అయోమయం కలిగిస్తాయి ఈ పరిసరాలు.
కనిపించే మనుషుల్లో కొందరు బౌద్ధలామాలు, మిగిలిన వాళ్లు భోతియాలు. వీరి ముఖకవళికలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు అన్నీ భిన్నంగా ఉంటాయి. ఈ జాతి వాళ్లు భారత్‌లోకంటే టిబెట్‌లోనే ఎక్కువ. ఇక్కడ ఏ పంటలు పండించాలన్నా వాతావరణం అనుకూలించేది ఏడాదిలో నాలుగైదు నెలలే. ఆ నాలుగు నెలల్లో పండించుకుని ఏడాదంతా నిల్వ చేసుకుని జీవనం సాగిస్తారు. ఇక్కడి వాళ్లు మాట్లాడే ‘భోతి ’ భాషను వింటుంటే మనకు హిందీలాగ ధ్వనిస్తుంది, కానీ ఒక్క పదం కూడా హిందీతో సరిపోలదు. వీరిలో ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు చాలా తక్కువ. ఒక మోస్తరుగా ఇంగ్లిష్ నేర్చుకున్నారంటే గైడ్లుగా స్థిరపడడానికే. గైడ్ల ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా పర్యాటకులకు వివరించడానికి తగినంత మాత్రమే. ఇతర వివరాలను పెద్దగా రాబట్టడం సాధ్యం కాదు. కాబట్టి స్పితి వ్యాలీకి టూర్ ఆపరేటర్లు నిర్వహించే ప్యాకేజ్‌లో వెళ్లడమే సౌకర్యం. స్పితిలోయలో పర్యటన చక్కటి విహారయాత్ర... అంతకంటే పెద్ద సాహసయాత్ర కూడ.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more