చలికాలం మొహం నుంచి కాలిగోరు వరకూ శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే తేమలేని చలిగాలి మన రూపాన్ని కాకి రంగులోకి మారుస్తుంది. అయితే చాలా మంది మొహం, చేతులు మీద పెట్టిన శ్రద్ధ పాదాలమీద పెట్టరు. మొహం నునుపుగా కనిపిస్తుంది. కానీ పాదాలే పగిలి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. సో పాదాల పట్ల స్పెషల్ కేర్ అవసరమే. ఎలా అంటే.
1. ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ ఏదైనా నూనెను తీసుకోవాలి. ఒక నిమిషం పాటు రెండు పాదాలకు నెమ్మదిగా మర్దనా చేయాలి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి. అలసిన పాదాలకు ఉపశమనం కలిగించడమే కాదు నునుపుగానూ అవుతాయి.
2. గోరు నీటిలో చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అందులో పాదాలను పావుగంట సేపు నానబెట్టాలి. అనంతరం స్క్రబ్బర్ లేదా నునుపైన రాయితో పాదాలను మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న డెడ్‌స్కిన్ అంతా పోతుంది.పాదాలను ఇప్పుడు చల్లని నీటితో కడిగి మెత్తటి టవల్‌తో తుడవాలి. పొడిగా ఉన్న పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల పాదాలు అందంగా తయారయవుతాయి.
3. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి కొన్ని పాలు కలపాలి. వీటికి సరిపడా ఓట్స్ పౌడర్ తీసుకుని పాదాలకు మర్దనా చేయాలి. అర్ధగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలపై డెడ్‌స్కిన్ తొలగిపోయి మృదువుగా ఉంటాయి.
4. ఒక బకెట్లో పావు భాగం వరకూ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్‌కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచాడు వంటసోడా వేసి ఒక అరగంటపాటు కాళ్లు అందులో ఉంచాలి.
5. కాళ్లు పగిలి బాధపెడుతుంటే రోజ్‌వాటర్, గ్లిజరిన్ , నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ఓ గాజుపావూతలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ స్నానం చేయడానికి అర్ధగంట ముందు, లేదా పడుకునేముందు అపె్లై చేయాలి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
6. బాగా పండిన బొప్పాయి గుజ్జుతీసుకుని దానికి కొంచెం నిమ్మరసం కలిపి కాళ్లకు మర్దన చేయడం వల్ల పగులు పోయి, పాదులు నునుపుగా మారతాయి.
7. గోరు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లకు వెంట్రుకలు పెరగకపోవడమే కాదు, చర్మం మృదువుగా తయారవుతుంది.
8. విటమిన్ ఇ నూనెలో కస్తూరి పసుపు పొడిని కలిపి మర్దనా చేయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. దీనివల్ల కాళ్లస్కిన్ బిగుతుగా తయారవ్వడమే కాక మంచి బ్లీచ్‌గా కూడా పనిచేస్తుంది.
9. ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని దానికి ఒక చక్కెర కలపండి. మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పాదాలపై రాయండి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి.
10. స్నానం చేసిన తరువాత ఆవ నూనెతో పాదాలు, చేతులను మర్దనా చేయండి. నీటితో కడిగేసి మెత్తటి టవల్‌తో తుడిచేయాలి. రోజంతా పొడిబారకుండా స్కిన్ తేమగా ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more