Gold dips below rs 27 000

gold prices, silver prices, sovereign, bar gold rates, ornament gold rates, bullion

Falling for the third straight session, gold prices on Tuesday slipped below the Rs 27,000 level as it crashed by a whopping Rs 1,160 to Rs 26,440 per 10 grams

పుత్తడి ధర చిత్తడి చిత్తడి

Posted: 04/17/2013 01:13 PM IST
Gold dips below rs 27 000

పుత్తడి ధర చిత్తడి అయింది. మొన్నటి వరకు పై పైకి పోతూ సామాన్యులకు అందనంత దూరానికి పోయిన బంగారం ధర మొన్న ఉగాది నుండి పతనం ప్రారంభం అయి ఏకంగా 27 వేల కిందకు చేరింది. ఇక మంగళ వారం నాడు దేశీయ మార్కెట్లో బంగారం వెయ్యికి పైగా తగ్గింది. ఢిల్లీ బంగారం 26440 కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో దేశీయ మార్కెట్లో కూడా భారీగా పతనం అవుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. కిలోకు రూ.1,875 తగ్గి రూ.46,125 వద్ద ముగిసింది. అయితే విశ్లేషకులు చెబుతున్న ప్రకారం చైనా వృద్ధిరేటు క్షీణించడం, ప్రముఖ సెంట్రల్ బ్యాంకు అయిన సప్రైస్ బ్యాంకు తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి భారీ ఎత్తున తన దగ్గరున్న నిల్వల్ని విక్రయించమే అంటున్నారు. అలాగే ఇటలీ కూడా సుమారు 2వేల టన్నుల వరకు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడంతో మార్కెట్లో బంగారం ధరలు గతంలో కనివినీ ఎరుగని రీతిలో క్షీణించడం ప్రారంభించాయి. దాని ప్రభావం మన దేశీయ
మార్కెట్‌పై పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles