Star producer in tollywood allu arvind

star producer in tollywood allu arvind, birthday today , lot of people greet him

star producer in tollywood allu arvind, birthday today

6.1.gif

Posted: 01/10/2012 11:36 AM IST
Star producer in tollywood allu arvind

arvind_outer          తెలుగు చిత్రసీమ దిగ్గజాలు ఎవరంటే టక్కున గుర్తోచ్చేవాళ్లలో అల్లు అరవింద్ ఒకరు. తెలుగు సినీ రంగానికి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఘనత ఆయన సొంతం. రోజుల ప్రకారం వైకుంట ఏకాదశి నాడు పుట్టిన ఈ `పట్టిందల్లా బంగారం`. ఆ రోజుని పురస్కరించుకుని చిరు, అల్లు కుటుంభ సభ్యులు తిరుమలలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

         డేట్స్ పరంగా అయితే జనవరి నెల ఇదే రోజు అంటే 10వ తేదీన అరవింద్ జన్మించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు అనేక మంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిర్మాతగా ఆయన తొలిచిత్రం `దేవుడేదిగివస్తే`.  మెగాస్టార్ చిరంజీవితో అరవింద్ నటించిన మొదటి సినిమా `యమకింకరుడు`.  ఇంకా చిరుతో కలిసి ఆయన `హీరో`, `చంటబ్బాయి`, మగధీరుడు చిత్రాల్లో నటించారు.  ఇంకా శివాజీ గణేశన్ సూపర్ హిట్ మూవీని అరవింద్ `బంగారుపతకం` పేరుతో అనువదించారు.  అటు బాలీవుడ్ లోనూ అల్లు అరవింద్ సినిమాలు నిర్మించారు.  బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తో తీసిన `గజనీ` సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది

గీతాఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చలన చిత్రరంగ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తున్న అరవింద్, 1974లో వచ్చిన `బంట్రోతు భార్య` మొదలు ఇటీవలి బద్రీనాథ్ వరకూ దాదాపు 33 సినిమాలకు ఆయన నిర్మాణ, నిర్వహణ, బాధ్యతలు చేపట్టారు. మగధీర, గజనీ, విజేత వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్లను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

జన్మదిన శుభాకాంక్షలతో పాటు, ఇంకా ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్ కే కాదు యావత్ భారతావనికే మంచి చిత్రాలను అందించాలని ఆకాంక్షిస్తోంది..ఆంధ్రావిశేష్.కాం

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former miss world priyanka chopra
Bollywood beauty deepika padukone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles