Pawan nagarjuna movies war end

pawan nagarjuna movies war end

pawan nagarjuna movies war end

24.gif

Posted: 08/20/2012 08:26 PM IST
Pawan nagarjuna movies war end

       ఇటీవల కొంతకాలంగా తెలుగు హీరోల మధ్య ఆరోగ్య కరమైన పోటీ నెలకొంటోంది. ఇందుకు కారణం టాలీవుడ్ కథానాయకుల ద్రుక్పదంలో మార్పే. ఇదే మరో సారి రుజువైంది. కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ డమరుకం విడుదలకు సిద్దంగా ఉందని మనకు తెలుసు. nag_pawan_fఈ భారీ చిత్రాన్ని, దసరా సందర్భంగా అక్టోబర్ 12 న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు డేట్ కూడా ప్రకటించారు. అయితే, అదే సమయంలో... అంటే అక్టోబర్ 11 న పవన్ కల్యాణ్ నటించిన 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు, ఆ చిత్ర నిర్మాత ఇంతకు ముందే ప్రకటించి వున్నారు.  దాంతో, ఎన్నడూ లేని విధంగా నాగ్, పవన్ ల మధ్య 'సినిమా వార్' జరగనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, పవన్ సినిమాతో పోటీ పడడం శ్రేయస్కరం కాదని నాగార్జున చెప్పడంతో, 'డమరుకం' నిర్మాతలు తమ సినిమాను డిసెంబర్ కు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదీగాక, ఓ పక్క తను నటించిన 'శిరిడీ సాయి' సినిమా సెప్టెంబర్లో విడుదలవుతుంటే... తనదే మరో సినిమా నెల రోజుల గ్యాప్ తో విడుదల కావడం కూడా అంత మంచిది కాదని నాగార్జున అభిప్రాయపడ్డారట. ఇలా ఎంతో హుందాగా వ్యవహరిస్తున్న మన హీరోల ప్రవర్తన తెలుగు చిత్ర సీమ పురోగతికి తార్కాణమనే చెప్పుకోవాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru movie sequel with charan and srinu vytla
Nandamuri taraka ratna new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles