Sorry teacher on youtube

sorry teacher on youtube, release, highcourt stay

sorry teacher on youtube

12.gif

Posted: 09/05/2012 04:09 PM IST
Sorry teacher on youtube

  ఇటీవలి కాలంలో వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన 'సారీ టీచర్' చిత్రం విడుదలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన విషయం మనకు తెలుసు. దీంతో ఈ చిత్ర నిర్మాత ఆనంద్ కొత్త ఎత్తుగడ వేసి, దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది యూ ట్యూబ్ ద్వారా మాత్రమే విడుదల కానుంది. అసలు విడుదల చేయకుండా వుండడం కన్నా...sorry_inneeeఇలా యూ ట్యూబ్ లో విడుదల చేయడం వల్ల, ప్రకటనల రూపంలో కొంత వరకు ఆదాయం రావచ్చని నిర్మాతకు సన్నిహితులు సలహా ఇస్తున్నారట. దీంతో, యూ ట్యూబ్ లో ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసుకుని, సినిమా విడుదలకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. సినిమాకు సెన్సార్ అనుమతి ఇచ్చినప్పకటీ... ఉపాధ్యాయ సంఘాలు, పలు ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సినిమాలో ఉపాధ్యాయులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ చిత్రంపై విచారణ పూర్తి అయ్యేవరకు విడుదల చేయరాదంటూ స్టే విధించిన సంగతి తెలిసిందే. గురుశిష్యుల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధాన్ని మంటగలిపేలా 'సారీ టీచర్' రూపొందిందని ఉపాధ్యాయుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనతో ఏకీభవించిన హై కోర్టు స్టే విధించింది. సూర్యలోక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ సత్య దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలకి ముందు వచ్చిన పోస్టర్లే ఇబ్బందికరంగా ఉండటంతో, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు.తమ వ్యతిరేకతను సెన్సార్ బోర్డు వారికి తెలియ జేశారు. అయితే ఈ సినిమాకి తాము U/A సర్టిఫికేట్ జారీ చేశామని చెప్పి చేతులు దులిపేసుకోవటంతో వ్యవహారం కోర్టుకెక్కింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna siridisai movie release tomarrow
Chanakyudu audio teaser release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles