Balakrishna krishna vamsi block buster

balakrishna krishna vamsi block buster, coming

balakrishna krishna vamsi block buster

20.gif

Posted: 09/05/2012 08:46 PM IST
Balakrishna krishna vamsi block buster

      balaప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కలల స్వప్నం బాలకృష్ణతో నెరవేర్చుకుంటున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. యాక్షనైనా,  ప్రేమ కథ అయినా, కుటుంబకథా చిత్రమేదైనా, దానిని విభిన్న మైన శైలిలో తెరకెక్కిస్తాడని వంశీకి పేరుంది. అటువంటి కృష్ణవంశీ ఇప్పుడు తన డ్రీం ప్రాజక్ట్ ను నందమూరి బాలకృష్ణతో రూపొందించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తనకు మెగాస్టార్ చిరంజీవితో ఓ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని ఇంతకుముందు ఒకసారి వంశీ తన మనసులో మాట బయటపెట్టారు. చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు కదా మరో హీరోతో చేస్తారా అన్న bala_krishna_vamsiప్రశ్నకు అప్పుడు వంశీ ఇలా సమాధాన మిచ్చారు. ఈ కథ చిరు లాంటి పవర్ ఫుల్ హీరో తో చేస్తేనే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని విన్నవించారు. అదే ప్రాజక్టు ఇప్పుడు బాలయ్యబాబుతో చేస్తున్నారని ఓ సమాచారం. ఇదే కనుక నిజమైతే.. బాలయ్య బాబు అభిమానులకు మరిచిపోలేని బ్లాక్ బస్టర్ అందినట్టే..
        ప్రస్తుతం దీనికి సంబంధించి బాలకృష్ణతో ఆయన స్టొరీ డిస్కర్షన్ లో వున్నారని అంటున్నారు. 'శ్రీమన్నారాయణ' సినిమా తరువాత సినిమాలకు కాస్త విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న బాలకృష్ణ, ఇప్పుడు కృష్ణవంశీ తెచ్చిన ప్రాజక్టుతో మనసు మార్చుకుని, ఈ సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Colors swathi ready to exposing
Smoking seens ok in films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles