Eem babu laddu kavala movie

eem babu laddu kavala movie, hero sivaji, atidhi agarwal heroine dreamline production 21st release

eem babu laddu kavala movie

6.gif

Posted: 09/13/2012 01:51 PM IST
Eem babu laddu kavala movie

      laddu_inneer  శివాజీ, అతిథి అగర్వాల్ జంటగా శ్రీవనితా డ్రీమ్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఏం బాబూ లడ్డూకావాలా’. గాంధీ మనోహర్ దర్శకత్వంలో టి.జనార్దన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో శివాజీ మీడియాతో ముచ్చటించారు.  పూర్తి హాస్యభరితంగా సినిమాకు కథ, మాటలు, పాటలు చక్కగా కుదిరాయని, అమెరికా, కేరళ ఫిలిం సిటీలో చిత్రీకరించిన పాటలు హైలెట్‌గా ఉంటాయని చెప్పారు. సీరియస్ కథ కాకపోయినా అనుమానం అనే అంశం చుట్టూ తిరిగే కుటుంబ కథాంశ చిత్రమని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు గాంధీ మనోహర్ తెలిపారు.
       ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభించిందని, చిత్రంకూడా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 21న విడుదల చేస్తున్నామని నిర్మాత జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
        రచనా వౌర్య, ఎం.ఎస్.నారాయణ, చిత్రం శ్రీను, భావన, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: బి.వాసు, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నిర్మాత: టి.జనార్దన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గాంధీ మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan new stills
Ade prema geetalu release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles