Tapsee talks on ajith romance

Tapsee talks on Ajith romance, Tapsee wants date with Ajith tapsee, ajith, tapsee latest movie news, tapsee tamil movie

Tapsee talks on Ajith romance, Tapsee wants date with Ajith,

అతని కోసం జపం చేస్తున్న గ్లామర్ తాప్సీ

Posted: 08/29/2013 11:30 AM IST
Tapsee talks on ajith romance

కాలం కలసిరాకపోతే ఏటికి ఎదురీదినట్లేనని అంటుంటారు. కొన్నాళ్లుగా తాప్సీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదని విశ్లేషకుల ఆలోచన . తనదైన చక్కటి గ్లామర్‌తో ఇంతకాలం ఎలాగోలాగ నెట్టుకొచ్చిన తాప్సీకి వరుస చిత్రాల ఫెయిల్యూర్‌ నిరాశకు గురిచేయడంతో పాటు అవకాశాలు సన్నగిల్లేలా చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 'వీర, దరువు, మొగుడు, షాడో, సాహసం' వంటి చిత్రాలు వరుసగా అపజయాన్ని చవిచూడటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడామె తన దృష్టిని తమిళ రంగంపై పెట్టి, అక్కడ 'ఆరంభం' అనే చిత్రం చేస్తోంది. మరోపక్క తమిళ, తెలుగు వెర్షన్‌లలో రూపొందుతున్న 'ముని-3'లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుమించి కొత్త చిత్రాలేవీ ఆమె చేతిలో లేకపోవడం గమనార్హమని అంటున్నారు. ఇదిలావుండగా, 'ఆరంభం' చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు అజిత్‌ వ్యక్తిత్వాన్ని తాను దగ్గరగా చూసిందట. అందుకే ఏ హీరోని మెచ్చుకోనంతగా ఆమె అజిత్‌ జపం చేస్తోంది. ఎంతోమంది హీరోలతో పనిచేసినప్పటికీ, అజిత్‌లాంటి మంచి మనిషిని ఇదివరకెన్నడూ తాను చూడలేదని సన్నిహితుల వద్ద తెగ పొగిడేస్తోందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles