Tapsee second change in bollywood

Tapsee second change in bollywood, Tapsee Second Chance on Bollywood Movies, Actress Tapsee Second Chance on Bollywood Movies, thapsi got another chance in bollywood, vicky donor director sujith sarkar

Tapsee second change in bollywood, Tapsee Second Chance on Bollywood Movies, Actress Tapsee Second Chance on Bollywood Movies, thapsi got another chance in bollywood, vicky donor director sujith sarkar

తెల్లపిల్ల పై బాలీవుడ్ దర్శకుడు కన్నేశాడు

Posted: 10/26/2013 09:55 AM IST
Tapsee second change in bollywood

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతి నుండి తెలుగు తెరకు జాలు వారిన తెల్లకలువ పిల్ల తాప్సీ అప్పటి నుండి ఏదో ఒక సినిమాతో బిజీగానైతే ఉంటుంది కానీ ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్ అయిన ధాఖలాలు లేవు. అయినా ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. కారణం తెల్లపిల్ల అందాలకు దర్శక, నిర్మాతలు ఫిదా అవ్వడమే. ఇప్పటికి పదికిపైగా సినిమాల్లో నటించిన ఈమె సినిమా లిస్టులో బాలీవుడ్ సినిమా కూడా ఒకటి ఉంది. ‘చష్మే బద్దూర్ ’ చిత్రం  మంచి కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో బాలీవుడ్  కూడా ఈ అమ్మడుకు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తరువాత అవకాశాలు వెల్లువెత్తుతాయనుకున్నా ఈమె వైపు చూసేవారు కరువయ్యారు. దీంతో నిరాశలో మునిగిపోయిన ఢిల్లీభామకు ఓ మంచి బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టింది.

బాలీవుడ్ సూపర్‌ హిట్ ‘విక్కీడోనర్ ’ దర్శకుడు సూజిత్ సర్కార్ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయికగా ఎంపికయ్యారు.  ఇందులో తాప్సీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. అయితే ఈమెకు ఆ అవకాశం రావడంతో మిగతా భామలు తాప్సీకి లేట్ గా వచ్చినా, లేటెస్ట్ ఆఫర్ వచ్చిందని, దీంతో తెల్లపిల్ల బాలీవుడ్ ని దున్నేయడం ఖాయం అని అనుకుంటున్నారు. ఇదే కాకుండా తెలుగులో ‘ముని - 3’, తమిళంలో అజిత్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు తాప్సీ. రాకరాక వచ్చిన ఈ అవకాశాన్ని బాలీవుడ్ లో సద్వినియోగం చేసుకోవడానికి దర్శక నిర్మాతలు అడిగితే... ఈ ఢిల్లీభామ తెల్లని పాలవంటి అందాలను బాలీవుడ్ తెర పై ఆరబోయడానికి కూడా సిద్ధంగా ఉందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles