Rajamouli next movie with pawan kalyan

Pawan Kalyan, SS Rajamouli, Baahubali, Vijayendra Prasad, Shobu Yarlagadda, Rajamouli film with Pawan, Director SS Rajamouli, Powerstar Pawan Kalyan, Rajamouli next with Pawan Kalyan, Baahubali producer Shobu

Tollywood ace director SS Rajamouli has reportedly narrated a storyline to Powerstar Pawan Kalyan.

రాజమౌళి తరువాతి సినిమా పవన్

Posted: 01/29/2014 05:50 PM IST
Rajamouli next movie with pawan kalyan

టాలీవుడ్ లో మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీస్ ఎవరంటే హీరోర్లో పవన్ కళ్యాణ్ పేరు, దర్శకుల్లో రాజమౌళి పేరు టక్కున చెప్పేస్తారు సినీ జనాలు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే. మరి ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ కాంబినేషన్ త్వరలో కార్యరూపం దాల్చబోతుందని సినిమా వర్గాల సమాచారం.

తెలుగు సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎస్.ఎస్. రాజమౌళి పంజా సినిమాకు కో- ప్రొడ్యూసర్ గా శోభు యార్ల గడ్డతో కలిసి పవన్ కళ్యాణ్ ని తన ఫాం హౌజ్ లో కలిసి ఓ స్టోరీ వినిపించాడని, ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కి పిచ్చ పిచ్చగా నచ్చిందని అంటున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా రాసిన స్టోరీకి రాజమౌళి చెప్పిన విధానికి ఫిదా అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ఈ చిత్రాన్ని శోభు యార్ల గడ్డ నిర్మించడానికి సిద్దంగా ఉన్నాడనీ, అన్నీ కుదిరితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం అంటున్నారు.  ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా బహుబలి చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. మరి అప్పటి వరకు ఫ్యాన్స్ వేచిచూడాల్సిందే. వీరిద్దరి కాంబినేషనల్లో సినిమా వస్తే గనుక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలవ్వడం ఖాయం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles