Sunil committed next film with vicky

Sunil next film with Vicky, Nallamalupu Bujji, Sunil new movie with vecky, Sunil latest news, Sunil new project

Hero sunil has commited to another new film. Nallamalupu Bujji is producing the movie which will be directed by a debutant Vicky.

కొత్త దర్శకుడితో కమీట్ అయ్యాడు

Posted: 03/06/2014 12:22 PM IST
Sunil committed next film with vicky

టాలీవుడ్ లోకి కమేడియన్ గా ఎంట్రీ ఆ తరువాత ఎంతో కష్టపడి హీరో స్థాయికి వచ్చిన సునీల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాలన్ని ఫర్వాలేదనిపించాయి. కానీ ఇటీవల వచ్చిన ‘భీమవరం బుల్లోడు ’ మాత్రం అనుకున్న స్థాయిలో హిట్టుకాలేక పోవడంతో దీని పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సునీల్ ఏ మాత్రం నిరాశ చెందకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరో కొత్త సినిమాకు సైన్ చేశాడని అంటున్నారు. 

ఇప్పటి వరకు కాస్తంత అనుభవం ఉన్న దర్శకుల దర్శకత్వంలో పనిచేసిన సునీల్ ఈ సారి కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడని తెలుస్తుంది. తాను చేయబోయే ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా విక్కీ అనే దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడట. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి దీనిని నిర్మిస్తాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందిస్తాం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles