Cat fight between trisha and nayanatara for queen remake movie

cat fight between trisha and nayanatara for queen remake movie, trisha latest news, nayanatara latest news, cat fight between trisha and nayanatara, queen movie remake in telugu, queen movie remake in tamil, director thyagarajan takes the rights of queen movie, queen movie tamil rights, thyagarajan latest news, nayanatara with trisha, trisha hot photos, nayanatara hot photos

cat fight between trisha and nayanatara for queen remake movie

కిరీటం కోసం పోట్లాడుకుంటున్న ముదురు తారలు

Posted: 06/24/2014 04:54 PM IST
Cat fight between trisha and nayanatara for queen remake movie

(Image source from: cat fight between trisha and nayanatara for queen remake movie)

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన హీరోయిన్ల మధ్య తగాదాలు ఏర్పడటం సర్వసాధారణమే! ముఖ్యంగా అగ్రకథానాయికల మధ్య ఇటువంటి వ్యవహారాలు ఎప్పుడూ నడుస్తూనే వుంటాయి. ఒకరికొచ్చిన సినిమా ఛాన్స్ మరొకరికి దక్కితే ఇక అంతే సంగతులు! వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ధోరణులు కలిగిన తారలు మన టాలీవుడ్, కోలీవుడ్ లో చాలామందే వున్నారు.

అందులో ముఖ్యంగా వినిపించేది త్రిష, నయనతారల పేర్లు. గతంలో కూడా వీరిద్దరి మధ్య వాడీవేడీ వాగ్యుద్ధాలు, క్యాట్ ఫైట్లు చాలా ఎక్కువగా జరిగాయి. అందులో ముఖ్యంగా శింబు నటించే ప్రతి సినిమాలో మొదట త్రిషకే హీరోయిన్ గా ఆఫర్ వచ్చినప్పటికీ... శింబుకి నయన్ తో వున్న సాన్నిహిత్యం వల్ల ఆ ఆఫర్లన్నీ ఈమెకే వరించేవి. రెమ్యూనరేషన్లపరంగా కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఎవరైనా డైరెక్టర్ ఒకరికి కథ వినిపిస్తే.. ఇంకొకరు దానిని ఒప్పుకునేవారు. ఇలా ఈ విధంగా వీరిద్దరి మధ్య రకరకాల గొడవలు నిత్యం జరుగుతూనే వుండేవి. ఇప్పుడు తాజాగా అదే వ్యవహారం వీరిద్దరి మధ్య మొదలయినట్టు కనిపిస్తోంది.

తమిళ నటుడు, దర్శకనిర్మాత అయిన త్యాగరాజన్.. బాలీవుడ్ లో భారీ కలెక్షన్లతో విజయాన్ని దక్కించుకున్న క్వీన్ సినిమా హక్కులను తీసుకున్న విషయం తెలిసిందే! ముందుగా ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకోవాలని దీర్ఘాలోచనలో పడిపోయిన ఈయన... తరువాత నయనతారను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తొలుత ఈ రీమేక్ సినిమాలో త్రిష నటిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ... త్యాగరాజన్ ఆ వార్తలు ఖండించారు. త్రిష ఈ సినిమాలో నటించడం లేదని, అసలు నేను ఆమె దగ్గరకు ఈ సినిమా ప్రస్తావనే తీసుకెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘అనామిక’’ సినిమాలో నయనతార నటన చాలా అద్భుతంగా వుందని... తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేయడంతో త్యాగరాజన్ ఈమెనే  ‘‘క్వీన్’’ సినిమాలో తీసుకుని కిరీటం పెట్టాలని నిర్ణయించుకున్నారట! మరోవైపు... ఎటువంటి ఆఫర్లు లభించక కెరీర్ తారుమారుగా మార్చుకున్న త్రిష పరిస్థితి ఏంటని ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. నయనతార వల్ల త్రిషకు భారీ నష్టం కలుగుతోందని తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles