Ram charan govindudu andari vadele movie teaser release

ram charan latest news, ram charan latest movies, ram charan govindudu andari vadele movie, govindudu andari vadele movie teaser, ram charan govindudu andari vadele movie teaser, hero srikanth latest news, kajal agarwal hot photos, prakash raj latest news

ram charan govindudu andari vadele movie teaser release : tollywood mega power star ram charan latest movie govindudu andarivadele movie teaser released which is directed by krishna vamsi.

రాధతో గోవిందుడి రొమాన్స్ అదుర్స్

Posted: 08/07/2014 07:57 PM IST
Ram charan govindudu andari vadele movie teaser release

(Image source from: ram charan govindudu andari vadele movie teaser release)

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా ‘‘గోవిందుడు అందరి వాడేలే’’! క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత బండ్లగణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దీనిని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీకి సంబంధించి ఇదివరకే చాలా ఫోటోలు రిలీజయ్యాయి. కానీ చెర్రీతో కాజల్ కలిసి వున్న ఫోటోలు మాత్రం రిలీజ్ కాలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది.

ఈ టీజర్ లో గోవిందుడు (చెర్రీ) తన రాధ (కాజల్ అగర్వాల్)తో బాగానే రొమాన్స్ పండించాడు. టీజర్ లోనే వీరిద్దరు ఇలా రొమాన్స్ చేయడానికి చూస్తుంటే.. సినిమా మొత్తం మీద వీరి మధ్య కెమెస్ట్రీ ఇంకెంత ఘాటుగా వుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా.. ఇందులో చెర్రీకి తాతయ్యగా ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా, హీరో శ్రీకాంత్ బాబాయ్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ కు జోడీగా కమిలినీ ముఖర్జీ నటిస్తోంది.

ram-charan-01

పూర్తిగా కుటుంబకథా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఆడియోని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం టీజర్ ప్రత్యేకంగా మీకోసం...

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles