Hero surya 24 movie title logo and latest updates

surya 24 movie logo, 24 movie latest news, 24 logo release, surya in 24 movie, surya latest movie, 24 movie telugu and tamil updates, 24 movie cast and crew, 24 movie heroine, koliwood latest updates, tollywood latest updates, surya next movie latest news, director vikram kumar movies

hero surya 24 movie title logo and latest updates : hero surya bilngual movie 24 releases its logo, director vikram kumar says 24 movie shooting will start in december and worked very to make a logo for this movie finally satisfied with latest released logo

అంతా సగంసగం చూపిస్తున్నారు

Posted: 11/22/2014 11:10 AM IST
Hero surya 24 movie title logo and latest updates

సొంత ఇండస్ర్టీ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న హీరో సూర్య తాజాగా మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినమా షూటింగ్ డిసెంబర్ నెల చివార వారంలో ప్రారంభం కానుంది. ‘మనం’ మూవీ డైరెక్టర్ విక్రంకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘24’ అనే పేరు పెట్టారు. తాజాగా సినిమా లోగోను కూడా డైరెక్టర్ విడుదల చేశారు. ఆన్ లైన్ లో విడుదల చేసిన ఈ లోగోకు తెగ క్రేజ్ ఏర్పడింది.

బ్లాక్ బ్యాగ్రౌండ్ లో..., షేడ్స్ కలిసిన యాష్ కలర్ లో ఉన్న లోగో స్టయిలిష్ గా కన్పిస్తుంది. ఒకే నంబర్ లో రెండు అంకెలను చూపించారు. అంటే ఒకే నంబర్ లో రెండిటిని సగంసగంగా చూపించారు. ఈ లోగోపై మాట్లాడిన డైరెక్టర్ విక్రమ్ కుమార్..., టైటిల్ ఎంపిక చేసినప్పటినుంచీ లోగోపై బాగా కసరత్తు చేశాన్నారు. చాలా లోగోలు పరిశీలించినా.., అంతా పసలేదని పక్కనబెట్టేశామన్నారు. 24 అనే నంబర్ ను ఎలా డిఫరెంట్, అట్రక్ట్ లుక్ తో చూపించాలి అని ఎంతగానో ఆలోచించామని వివరించారు. చివరకు చాలా కష్టపడి తాజా లోగోను రూపొందించారన్నారు.

ప్రేక్షకులకు తప్పకుండా తాజా లోగో నచ్చుతుందని డైరెక్టర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అనుకున్నట్లుగానే సోషల్ మీడియాలో ఈ లోగో బాగా షేర్ అవుతోంది. సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉండటంతో ‘24’ సినిమాను రెండు బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surya  24 movie  logo  vikram kumar  tamil and telugu  bilingual  

Other Articles