Mega prince varun tej puri jagannath krish upcoming movies updates

varun tej puri jagannath movie, varun tej krish movie updates, varun tej upcoming movie updates, varun tej mukunda movie latest updates, mukunda movie release date, mukunda movie teasers trailers, varun tej mukunda latest photos, tollywood latest news updates, allu arjun trivikram srinivas movie updates, ram charan srinu vaitla movie updates

mega prince varun tej puri jagannath krish upcoming movies updates : mega prince varun tej confirms future projects and tells upcoming movies with puri jagannath jagarlamudi radhakrisha alias krish after mukunda movie

కొడుకుతో ప్రయోగాలు చేస్తున్న మెగా బ్రదర్

Posted: 12/22/2014 08:58 AM IST
Mega prince varun tej puri jagannath krish upcoming movies updates

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ విడుదలకు సిద్దమవుతోంది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆడియో, టీజర్లకు మంచి స్పందన రావటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ విన్పిస్తోంది. ఫ్యాన్స్ లో వరుణ్ పై ఉన్న క్రేజు వల్ల అప్పుడే ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సినిమా చేస్తామంటూ డైరెక్టర్లు నాగబాబుకు ఫోన్ చేసి అడుగుతున్నారట. తనయుడిని ఓ పద్దతి ప్రకారం ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నాగబాబు ప్రయోగం చేస్తున్నాడు.

తొలి సినిమా కావటంతో యూత్ తో పాటు.. ఫ్యామిలీకి కూడా దగ్గరవ్వాలని ఉద్దేశ్యంతో శ్రీకాంత్ అడ్డాలతో సినిమా తీసిన వరుణ్.., రెండవ సినిమా మాస్ టార్గెట్ గా నటించే అవకాశముంది. మాస్ నాడి బాగా తెలిసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో రెండవ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే వరుణ్ తో పాటు నాగబాబుతో కూడా చర్చ జరిగి ఓకే అయింది. మెగా  ప్రిన్స్ కోసం మంచి కథ రాసుకుని.., మెరుగులు దిద్దే పనిలో పూరి బిజీగా ఉన్నాడు.

ముచ్చటగా మూడవ సినిమాకు కూడా కొడుకును మెగా బ్రదర్ సిద్దం చేస్తున్నారు. ఫ్యామిలి, మాస్ తర్వాత ఎక్కువగా ఫ్యాన్స్ ఉండే వెరైటీ, స్టోరీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తెలుగులో ఈ తరహా  మూవీలు తెరకెక్కించే రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారంగానే ముకుంద తర్వాత పూరీ జగన్నాథ్, క్రిష్ తో సినిమా చేస్తున్నట్లు వరుణ్ ప్రకటించారు. ఇలా ఒక పద్దతి ప్రకారం కొడుకును ఇండస్ట్రీకి తీసుకొస్తున్న నాగబాబు ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej puri jagannath movie  mukunda latest  krish upcoming movies  

Other Articles