Ntr temper teaser balakrishna nbk lion movie teaser

Balakrishna, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna latest, NBK Lion teaser, NBK Lion photos, NBK Lion latest photos, NBK Lion release date, Nandamuri Balakrishna 99th movie, balakrishna 100th movie updates, Jr Ntr, temper movie teaser, temper movie latest updates, temper movie latest photos, ntr upcoming movies

NTR Temper Balakrishna NBK Lion movie teasers : Nandamuri celebrating new year with double josh by balakrishna and ntr movie teasers. Balakrishna New movie teaser released with NBK LION title. Temper movie released NTR High voltage Teaser on new year eve

అబ్బాయ్ అదుర్స్.., బాబాయ్ బ్లాక్ బస్టర్స్

Posted: 01/01/2015 07:25 AM IST
Ntr temper teaser balakrishna nbk lion movie teaser

వీక్షకులు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నందమూరి అభిమానులు న్యూ ఇయర్ వేడుకలు డబుల్ జోష్ తో చేసుకుంటున్నారు. కొత్త సంవత్సర వేళ నందమూరి హీరోలు డబుల్ ధమాకా అందించారు. బాబాయ్, అబ్బాయ్ సినిమాల టీజర్లు విడుదలై ఏడాదిలో చివరి రోజు రాత్రిని అభిమానులకు గుర్తుండిపోయేలా చేశాయి. రెండు టీజర్లను చూసిన అభిమానులు లయన్ ఫీవర్ తో టెంపరెక్కిపోతున్నారు. నూతన సంవత్సర కానుకగా విడుదల అయిన టీజర్లపై ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఓ సారి చూద్దాం.

సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా టైటిల్ పై  నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ‘ఎన్.బి.కె.లయన్’గా సినిమా పేరును  ఖరారు చేశారు. గతేడాది డిసెంబర్ 31న అర్దరాత్రి ఈ మూవీ టీజర్ కూడా విడుదల చేయటంతో సస్పెస్స్ తొలగింది. సీబీఐ ఆఫీసర్ గా నందమూరి హీరో పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘నేను కొడితే హిస్టరీలో వినబడుతుందన్న డైలాగ్’తో సినిమా నిజంగానే టాలీవుడ్ హిస్టరీలో వినబడేలా ఉంటుందని చెప్తున్నారు.  ఆ టీజర్ ఎలాగుందో మీకోసం అందిస్తున్నాం

త్రిష, రాధికా ఆప్టే ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నా.., టీజర్ లో మాత్రం కేవలం ఆప్టేనే చూపించారు. దీంతో త్రిష అభిమానులు అసంతృప్తి ఫీల్ అవుతున్నారు. అయితే.., సంక్రాంతి కానుకగా జరిగే రిలీజ్ లో త్రిష ఉంటుందని మూవీ యూనిట్ చెప్తోంది. బాలయ్య సినిమా గురించి ఫ్యాన్స్ ఇలా అనుకుంటుంటే.., నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’టీజర్ గురించి ఏమనుకుంటున్నారో ఓ సారి చూద్దాం.

 

ntr-temper-teasr-look

న్యూ ఇయర్ కానుకగా రెండ్రోజుల ముందుగానే ‘టెంపర్’ ఫోటోలు విడుదల అయి సింప్లీ సూపర్బ్ అని మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇక బాబాయ్ కు పోటి అని చెప్పలేము కానీ.., బాబాయ్ తో పాటుగా వచ్చిన అబ్బాయ్ టీజర్ కూడా భారీ ఎత్తునే ఉంది. యుద్దం మొదలుపెట్టానంటూ చెప్తున్న డైలాగ్ కు విజయమే వరిస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ లో మంచి ఎనర్జీతో పాటు.., ఫైట్ సీన్లోనూ నవ్వే పూరీ మార్కు ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని కన్పిస్తోంది. దీంతో సినిమా ఆలస్యంగా వస్తున్నా.., సూపర్ హిట్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘లయన్’లో బాబాయ్ సీబీఐ ఆఫీసర్ అయితే ‘టెంపర్’లో అబ్బాయ్ పోలిస్ ఆఫీసర్. ఇద్దరూ దేశాన్ని, చట్టాన్ని కాపాడే వ్యక్తులే కావటం విశేషం.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుటుందని.., టీజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూస్తేనే అర్థమవుతోంది. వక్కంతం వంశీ కథ కూడా బాగా వర్కవుట్ అవుతుందని అన్పిస్తుంది. సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన టీజర్ ను మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.



కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NBK Lion  Nandamuri Balakrishna  Temper movie  

Other Articles