Temper movie shooting photos

Temper movie, Temper movie updates, Temper movie latest photos, Temper movie shooting photos, Temper audio release, Temper movie cast and crew, temper movie Updates, Ntr next movie, Ntr latest photos, tollywood upcoming movies, latest telugu movies, puri jagannath movies

Temper movie shooting photos : Puri Jagannath releases latest shooting poster of Temper movie. Temper movie shooting in final stage, it will completed in a couple of days. temper latest photos and teaser attracts fans with good response

అప్పుడు ఆంధ్రావాలా.., ఇప్పుడు ఆటోవాలా

Posted: 01/03/2015 12:29 PM IST
Temper movie shooting photos

లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానంటూ నందమూరి హీరో ‘టెంపర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. చివరి దశలో ఉన్న మూవీ షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. పిబ్రవరి 5కు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో.., ఈ లోపు సినిమాను ప్రమోట్ చేసుకోవటంపై బాగా బిజీగా ఉన్నారు. న్యూ ఇయర్ కానుకగా టీజర్ ను విడుదల చేసి క్రేజ్ తెచ్చుకున్న ‘టెంపర్’.., తాజాగా మరో ఫోటోను విడుదల చేసింది. మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో ఉన్న ఫొటోను పూరీ జగన్నాధ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

ఫొటోలో ఆటోలో కూర్చున్న పూరీ చెప్పే కథను ఎన్టీఆర్ ఆసక్తిగా వింటున్నాడు. ఈ పోటో చూసిన కొందరు క్రేజీ అబ్బాయిలు.., అప్పడు ఆంధ్రావాలా తీస్తే.., ఇప్పుడు ఆటోవాలా క్రియేట్ చేస్తున్నాడా ఏమిటి అనుకుంటున్నారు. కానీ ఈ మూవీలో తారక్ పోలిస్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ దయ గా కన్పించనున్నాడు. వచ్చేవారానికి షూటింగ్ పూర్తి చేసి జనవరి 18న ఆడియో రిలీజ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ‘టెంపర్’ మూవీని పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ‘బాద్ షా’ తర్వాత కాజల్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. నిర్మాతకు ఉన్న ఇబ్బందుల కారణంగా రెమ్యునరేషన్లకు బదులు సినిమా హక్కులను ఇచ్చేసిన విషయం తెలిసిందే. నైజాం హక్కులు ఎన్టీఆర్ కు, సీడెడ్ రైట్స్ పూరీకి, నెల్లూరు జిల్లా హక్కులు కథ ను అందించిన వక్కంతం వంశీకి ఇచ్చాడు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  ntr movies  puri jagannath latest  

Other Articles