Bandla ganesh pray for temper movie success

Bandla Ganesh Pray for temper movie success, Bandla Ganesh Pray for temper movie, Bandla Ganesh Pray for temper success, Temper movie producer, Temper movie latest news, Temper movie updates, Temper release date, Temper songs, Temper audio, Temper trailers, Temper teaser, Temper posters, Temper stills, Temper

Bandla Ganesh Pray for temper movie success: Parameshwara art productions producer Bandla Ganesh Pray for temper movie success. puri jagannadh direction. ntr, kajal act in lead roles.

టెంపర్ కోసం మల్లన్న దర్శనం

Posted: 02/02/2015 07:44 PM IST
Bandla ganesh pray for temper movie success

పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 13వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత ఆ రేంజులో బండ్ల గణేష్ నిర్మించిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టవ్వలేదు. కలెక్షన్లు రాబట్టలేకపోయాయి.

అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ‘టెంపర్’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలని తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు. ఈ నిర్మాణ సంస్థ బండ్ల గణేష్ సోదరుడు బండ్ల శివబాబు సమర్పకుడిగా వ్యవహిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సమయంలో శివబాబు షాద్ నగర్ నుంచి శ్రీశైలం మల్లన్న స్వామి సన్నిధానం వరకు పాదయాత్ర చేసారు. పాదయాత్ర చేసి, శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడం వల్ల ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం సాధించిందనే ఉద్దేశ్యంతో.... ఈ సెంటిమెంట్ ను మళ్లీ ఇపుడు రిపీట్ చేస్తున్నారు.

‘టెంపర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో తాజాగా మళ్లీ శ్రీశైలం మల్లన్న స్వామి సన్నిధానం వరకు వీరు పాదయాత్రం ప్రారంభించారు. ఇప్పుడు కూడా మల్లన్న స్వామి ఆశీస్సులతో ‘టెంపర్’ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు బండ్ల గణేష్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్లు దుమ్ముదులిపేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper  Bandla Ganesh  Pray  Srishailam  Ntr  Puri Jagannadh  Kajal Agarwal  

Other Articles