Jayasudha fight with rajendra prasad

Jayasudha ready to fight with Rajendra Prasad, Jayasudha in Maa elections, Jayasudha news, Jayasudha press meet, Jayasudha gossips, Jayasudha interview, maa association president elections, maa association elections, murali mohan news

Jayasudha fight with Rajendra Prasad: Jayasudha maa association president elections news murali mohan. Rajendra prasad has announced that he is participating in maa association president elections.

మా అధ్యక్ష పదవికి జయసుధ పోటి

Posted: 03/20/2015 10:07 AM IST
Jayasudha fight with rajendra prasad

ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు గత ఆరు సార్లు ప్రముఖ నటుడు అధ్యక్షుడిగా పనిచేసారు. అయితే ఈసారి ఈ అధ్యక్ష పదవికి మురళీ మోహన్ దూరంగా వున్నారు.

దీంతో ఈసారి అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అలాగే నటులు నాగబాబు, శివాజీరాజా తదితరులు ఆయనకు మద్ధతు కూడా ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ కు పోటీగా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు కూడా పోటీకి దిగనున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి.

కానీ ఈ విషయంపై మంచు విష్ణు ఏ విధంగా స్పందించలేదు. అయితే తాజాగా నటి జయసుధ కూడా ఈ పోటీలో పాల్గొనడం విశేషం. నటి జయసుధ ఇప్పటికే ప్రభుత్వ ఎన్నికల్లో గెలిచి పదవులను చెపట్టింది. అయితే తాజాగా ఈ ‘మా’ అధ్యక్ష పదవి కోసం కూడా జయసుధ పోటీలోకి దిగడంతో ఈ ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

ఈరోజు జయసుధ ‘మా’ లో నామినేషన్ వేయనున్నారు. మరి ఇలా హఠాత్తుగా జయసుధ ఎన్నికల్లో పోటీ చేయడానికి... తన వెనక పెద్ద హస్తాలే వున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయంపై త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో త్వరలోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayasudha  Rajendra Prasad  MAA  Elections  

Other Articles