Anushka Sharma Liplock Clarification | Bombay Velvet Movie

Anushka sharma clarification on liplock scenes with ranbir kapoor bombay velvet

anushka sharma news, anushka sharma liplock scenes, anushka sharma lips, anushka sharma love affairs, anushka sharma scandals, anushka sharma affairs, anushka sharma hot videos, anushka sharma sexy videos, anushka sharma ranbir kapoor, anushka sharma ranbir liplock scenes, anushka sharma virat kohli affair

anushka sharma clarification on liplock scenes with ranbir kapoor Bombay Velvet : Bollywood sexy beauty anushka sharma has given clarification on liplock scenes with ranbir kapoor in bombay velvet movie which is directed by anurag kashyap.

ఇద్దరూ ప్రేమలో వున్నాం కాబట్టే ముద్దాడుకున్నాం!

Posted: 03/24/2015 01:09 PM IST
Anushka sharma clarification on liplock scenes with ranbir kapoor bombay velvet

ఇటీవలే వస్తున్న సినిమాల్లో లిప్ లాక్ సీన్లు వుండటం సర్వసాధారణం అయిపోయింది. బాలీవుడ్ లో అయితే ప్రతిమూవీలోనూ ఒక్కటైనా ముద్దు సీన్ వుండాల్సిందే! ఈ సన్నివేశాలుంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారని, తద్వారా తమ మూవీకి బాగానే కలెక్షన్లు కురాస్తాయన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా ప్లాన్ చేస్తుంటారు. ఇక ఎలాగూ విదేశీ కల్చర్ ఇండియాలో బాగానే పాపులర్ అయింది కాబట్టి.. ఆయా సీన్లలో నటించేందుకు నటీనటులు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. అనుష్క, రణ్ బీర్ జంటగా హిందీలో ‘బాంబే వెల్వెట్’ చిత్రం తెరకెక్కుతోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్ బీర్ బాక్సర్ ‘బాల్‌రాజ్’ పాత్రలో, అనుష్క సింగర్ ‘రోశీ’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ లో వీరిమధ్య కొన్ని లిప్ లాక్ సీన్లు వున్నాయి. అంతేకాదు.. మొత్తం సినిమాలో వీరి మధ్య దాదాపు ఏడు ముద్దు సీన్లు వున్నాయని వార్తలొస్తున్నాయి. పైగా.. రొమాంటిక్ సన్నివేశాలు కూడా వున్నాయట!

ఇలా అనుష్క ప్రతి సినిమాలోనూ ముద్దుసీన్లలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ఆమెను.. ‘లిప్ లాక్ సీన్లలో నటించడం మీకు ఇబ్బందిగా వుండదా..?’ అని ప్రశ్నించగా.. అందుకు ఆమె సీరియస్ గానే బదులిచ్చింది. ‘‘పెదవి ముద్దు సన్నివేశాలనగానే అదేదో పెద్ద విషయంలా మాట్లాడతారేంటి? ఇద్దరు ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అలాంటివి ఉండవా ఏంటి? అయినా కెమెరా ముందు వున్నది నేను కాదు.. రోశీ అనుకుంటా. రోశీకి బాల్‌రాజ్ అనే ప్రేమికుడు ఉంటే అతనితో ఎలా రొమాన్స్ చేస్తుందో ఊహించుకుని, అలా చేసేస్తా. ప్రేమలో ఉన్నవాళ్ల మధ్య తీపి కబుర్లతో పాటు తియ్యని ముద్దులు సహజం.’’ అంటూ ఈ అమ్మడు అంటోంది.
 
అలాగే.. ‘‘రణ్‌బీర్‌కి  నిజజీవితంలో ప్రేయసి ఉంది. నేను కూడా ప్రేమలో ఉన్నాను కదా. అందుకే రొమాంటిక్ సీన్స్‌ని సునాయాసంగా చేసేస్తాం. పైగా, రణ్‌బీర్‌తో రొమాంటిక్ సీన్స్ అంటే నాకు ఇబ్బందిగా అనిపించదు. ఎందుకంటే, తన మనసులో లేనిపోని ఊహలు ఉండవు. ‘నటిస్తున్నాం.. అంతకు మించి ఏమీ లేదు’ అనుకుంటాడు. నేనూ అలానే అనుకుంటా. అందుకే మా కెమిస్ట్రీ బాగుంటుంది. ఆయా సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు... దానికి సంబంధించి ముందుగానే చర్చించుకుంటాం. అందుకే.. ఆ సీన్లలో నటించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది వుండదు’’ అని తెగేసి చెబుతోంది. అనుష్క.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  liplock scenes  ranbir kapoor  bombay velvet movie  

Other Articles