hero nani says that he is not attending bahubali audio launch | eega movie | rajamouli

Hero nani not attending bahubali audio launch ceremony

hero nani news, rajamouli news, bahubali movie, bahubali the begining, bahubali audio launch, bahubali movie updates, bahubali movie gallery, bahubali posters, prabhas, anushka shetty, rana daggubati, tamanna bhatia

hero nani not attending bahubali audio launch ceremony : Tollywood young hero tweeted that he is not attending bahubali movie audio launch due to injury during bhale bhale magadivoy movie shooting.

గాయం.. నానిని ‘బాహుబలి’ నుంచి దూరం చేసింది!

Posted: 06/13/2015 10:22 AM IST
Hero nani not attending bahubali audio launch ceremony

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు రెండేళ్లపాటు సాగింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కాగా.. జూన్ 13వ తేదీన ఆడియోని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ అధికారిక ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుపతిలో వెంకటేశ్వర యునివర్సిటి ప్రాంగణంలో ఆడియో లాంచ్ కార్యక్రమం కోసం చకచకా పనులు పూర్తి చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఘనంగా ఏర్పాటు చేసిన ఈ వేదికపై ఈరోజు (13-06-2015) రాత్రి ఈ మూవీ ఆడియో విడుదల కానుంది. ‘బాహుబలి-ది బిగినింగ్’ మూవీని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఇదిలావుండగా.. రాజమౌళి తీసే సినిమాలకు సంబంధించి ఏవైనా ఫంక్షన్లు నిర్వహించినప్పుడు.. గతంలో ఈయనతో కలిసి పనిచేసిన హీరోలు ఆయా ఈవెంట్లకు హాజరవుతారు. ఇప్పుడు ‘బాహుబలి’ ఆడియో వేడుకలోనూ అలాగే కొందరు హీరోలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజమౌళితో కలిసి ‘ఈగ’ చిత్రంలో పనిచేసిన యువహీరో నాని మాత్రం ఈ అద్భుతమైన ఈవెంట్ కి దూరం కానున్నాడు. ప్రస్తుతం నాని ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం చిత్రీకరణలో ఫుల్ బిజీగా వున్న విషయం తెలిసిందే! ఈ మూవీ షూటింగ్ సమయంలోనే నాని అనుకోకుండా గాయపడటంతో అతడు ఈ వేడుకకు దూరం కానున్నట్లు ట్విటర్ లో తెలిపాడు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా షేర్ చేస్తూ తనని మిస్ అవ్వనున్నట్లు తెలిపాడు. మరి.. మిగతా హీరోలు ఎవరెవరు వస్తారా అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali audio  hero nani  rajamouli  

Other Articles