Mahesh Srimanthudu Stunt Video Leaked

Mahesh srimanthudu stunt video leaked

Mahesh Srimanthudu Movie Stunt Video Leaked, Mahesh Srimanthudu Audio Venue Details, Mahesh Srimanthudu Release Date Confirmed, Srimanthudu Release Date Confirmed, Srimanthudu movie latest news, Srimanthudu release date, Srimanthudu movie officially confirmed, Srimanthudu movie updates, Srimanthudu updates, Srimanthudu movie release confirmed, Srimanthudu audio date, Srimanthudu

Mahesh Srimanthudu Stunt Video Leaked: Mahesh Babu action video leaked from his upcoming film Srimanthudu. Devi sri prasad music director. audio release on 18 july. this film will be release on 7th August. Koratala siva direction.

లీకైన మహేష్ శ్రీమంతుడు యాక్షన్ స్టంట్

Posted: 07/13/2015 01:08 PM IST
Mahesh srimanthudu stunt video leaked

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రానికి లీకేజీల బెడద చాలా ఎక్కువయ్యింది. ఈ సినిమా ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత షూటింగ్ స్పాట్ లో వున్న కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తాజాగా ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది.

విలన్ ను మహేష్ జంప్ చేసి కొట్టే సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోకు మంచి స్పందన వస్తున్నప్పటికీ.. ఇలా సినిమా థియేటర్ ట్రైలర్ కూడా విడుదల కాకముందే లీకేజ్ లు మొదలయ్యి, చిత్ర యూనిట్ ను కంగారుపెడుతోంది.

‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 18న గ్రాండ్ గా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు.

ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Video Courtesy : Movie Mitra

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Srimanthudu  Stunt Video Leaked  Shruti Haasan  

Other Articles