bollywood cute beauty alia bhatt got huge chance to act with mahesh babu in murugadoss directorial film | tollywood gossips

Alia bhatt got chance to act with mahesh babu in murugadoss directorial film

alia bhatt news, alia bhatt hot news, alia bhatt controversy, alia bhatt news, alia bhatt latest updates, alia bhatt mahesh babu, mahesh babu 80 crores movies, mahesh babu murugadoss movie, tollywood gossips, mahesh babu gossips

alia bhatt got chance to act with mahesh babu in murugadoss directorial film : bollywood cute beauty alia bhatt got huge chance to act with mahesh babu in murugadoss directorial film.

మహేష్ పేరు వినగానే.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట!

Posted: 10/23/2015 03:43 PM IST
Alia bhatt got chance to act with mahesh babu in murugadoss directorial film

బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన ఆలియా భట్ ను తెలుగులో నటింపజేయడానికి గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అనతికాలంలోనే తన సెక్సీ హంగులతో స్టార్ స్టేటస్ కైవసం చేసుకోవడంతోపాటు యువత మనసుల్ని దోచుకున్న ఈ ముద్దుగుమ్మను తమ సినిమాల్లో నటింపజేస్తే.. ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందన్న ఆశతో ఇక్కడి దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే.. హిందీ సినిమాల కమిట్ మెంట్స్ కారణంగా ఈ అమ్మడు ఇంతవరకు సౌత్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికీ పలు సినిమాలతో ఈ అమ్మడు బిజీగానే వుంది. కానీ.. మహేష్ సరసన నటించే ఆఫర్ రాగానే ఈ బబ్లీ బ్యూటీ వెంటనే ఒప్పేసుకుందని సమాచారం.

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో 80 కోట్ల భారీ బడ్జెట్టుతో ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ మూవీ యూనిట్.. హీరోయిన్ కోసం వేట కొనసాగించింది. తొలుత సౌత్ లో మంచిపేరున్న నటిని కథానాయికగా ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ.. బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటే అక్కడ కూడా సినిమాకి క్రేజ్ వస్తుందని భావించి.. అక్కడి భామలను సంప్రదించారు. స్టార్ స్టేటస్ లో వున్న కొందరు హీరోయిన్లు రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయగా.. మరికొందరు డేట్స్ లేవంటూ ముఖం చాటేశారట. ఈ నేపథ్యంలోనే ఆలియా భట్ ను సంప్రదించగా.. ఆమె వెంటనే ఒప్పుకుందని సమాచారం. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt gossips  mahesh babu murugadoss  

Other Articles