‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా భారీ గుర్తింపును తెచ్చుకున్న ‘భల్లాలదేవ’ రానాకు వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం వరుస బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా వున్న రానాకు తాజాగా మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
1971లో ఇండియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం సమీపం సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్న తాజా చిత్రం ‘ఘాజీ’. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు.
సంకల్ప్ రెడ్డి ద్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలక కావడంతో.. చాలా మంది హీరోయిన్లను అనుకొని చివరకు తాప్సీని ఎంపిక చేసినట్లుగా తెలిసింది. గతంలో రానా, తాప్సీలు కలిసి ‘బేబీ’ అనే యాక్షన్ సినిమాలో నటించారు. ‘బేబీ’ తర్వాత మరోసారి వీరిద్దరూ ఈ ‘ఘాజీ’ సినిమాలో జతకట్టనున్నారు.
విశాఖ తీరంలో వున్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more