Naannaku prematho decicated to my father

Naannaku prematho decicated to my father

Naanaku Prematho, NTR, Sukumar, DeviSriPrasad, NTRs Naannaku Prematho, NTRs Next film, New Look in Naannaku Prematho, Naannaku Prematho Audio

NTRs and Sukumars new film Naannaku Prematho audio released. DeviSriPrasad dedicated this album to his father. DeviSri gave excellent audio for Nannaku Prematho.

నాన్నకు అంకితం ‘నాన్నకు ప్రేమతో’

Posted: 12/28/2015 11:18 AM IST
Naannaku prematho decicated to my father

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా నాన్నకు ప్రేమతో ఆడియో లాంఛ్ అట్టహాసంగా జరిగింది. నందమూరి హరికృష్ణ ముఖ్య అతిథిగా ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా సాగింది. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, సుకుమార్, నందమూరి కళ్యాణ్ రామ్, జగపతిబాబులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ ఎంతో ఎమోషనల్ గా జరిగింది. దేవీశ్రీప్రసాద్ ఈ ఆడియోను తన తండ్రి సత్యమూర్తికి అంకితమిచ్చినట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి ఆడియోని రిలీజ్ చేసి మొదటి సిడిని హరికృష్ణకి అందించారు. ఇది తన సినిమా కాదు సుకుమార్ జీవితం... తన పాత్రలో సుకుమార్ ని ఊహించుకోవాలని ఎన్టీఆర్ తెలిపారు. తల్లి తండ్రులతో పాటు అందరి అమ్మ నాన్నలకు మేమిస్తున్న నీరాజనం ఈ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అని ఎన్టీఆర్ అన్నారు. అంతేకాదు, తారక్ చేత ఈ సినిమాలో దేవీ ఓ పాటను కూడా పాడించాడు. ఎన్టీఆర్ సాంగ్‌ను చాలా బాగా పాడాడని కితాబిచ్చాడు. ఆ పాట మరేదో కాదు.. ఫస్ట్ లుక్‌లోనే అభిమానుల మనసు దోచుకున్న ఫాలో.. ఫాలో సాంగట. ఇంకేముంది, నందమూరి అభిమానులకు దేవీశ్రీ ప్రసాద్ మరోసారి పాటల విందును అందించబోతున్నాడనమాట.

dsp-tweet

ఇక సినిమా ట్రైలర్ నందమూరి అభిమానులకు కనువిందు చేస్తోంది. పాటలు అదిరిపోయేలా ఉంటే.. సినిమా ట్రైలర్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. టెంపర్ సినిమా హిట్ తర్వాత సుకుమార్ తో ఎర్టీఆర్ చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్ రికార్డ్ స్థాయిలో యుట్యూబ్ లొ హిట్స్ ను సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సత్తా చాటింది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  DeviSriPrasad  Sukumar  Naannaku Prematho  

Other Articles