రాజ్ కందుకూరి సమర్పిస్తున్న సినిమా ‘నాయకి’. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. త్రిష ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలు. గోవి దర్శకుడు. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసారు.
థియేట్రికల్ ట్రైలర్ భీమనేని శ్రీనివాస్ రావు, అంబికా కృష్ణ, ఎన్.శంకర్ విడుదల చేశారు. బిగ్ సీడీని నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆడియో సీడీలను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి తొలి సీడీని త్రిషకు అందించారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... నాయకి టైటిల్ బాగా నచ్చింది. ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఒక చేతిలో పువ్వులు, మరో చేతిలో కత్తి పట్టుకుని ఉన్న త్రిష లుక్ బావుంది. వైవిధ్యమైన పాత్ర చేయడమే కాకుండా పాట కూడా చక్కగా పాడింది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. పాటలు సీన్స్ చూస్తుంటే మంచి మెసేజ్ ఉన్నట్లు కనపడుతుంది. నాయకుడు అనే కమల్ సినిమా వచ్చింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ టైటిల్ తో నాయకి అనే సినిమా వస్తుంది. ఆ సినిమాను ఈ సినిమా క్రాస్ చేయాలి. త్రిష నటనలోని మరో కోణం ఆవిష్కరించబడాలి. సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు.
త్రిష మాట్లాడుతూ.... నందమూరి బాలకృష్ణగారికి ప్రత్యేకమైన దన్యవాదాలు. రఘుకుంచె మంచి సంగీతం అందించారు. అంతే కాకుండా నాతో పాట పాడించారు. గోవిగారికి, గిరిధర్ గారికి, రాజ్ కందుకూరి, రాంబాబు సహా అందరికీ థాంక్స్ అన్నారు.
త్రిష, బ్రహ్మానందం, సత్యం రాజేష్, గణేష్ వెంకట్ రామన్, సుష్మరాజ్, జయప్రకాశ్, మనోబాల, కోవై సరళ, పూనమ్ కౌర్, మాధవీలత, సెంట్రియాన్,జీవీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్: వెంకట్, కళ: కె.వి.రమణ, కూర్పు: గౌతంరాజు, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: రఘు కుంచె, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సాయికార్తిక్, లైన్ ప్రొడ్యూసర్: ఎం.వెంకటసాయి సంతోష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాంబాబు కుంపట్ల, కెమెరా: జగదీష్ చీకటి, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: గోవి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more