నరేష్ శ్రీదేవీకి ఎలా ఐ లవ్ యూ ఎలా చెప్పాడు | naresh about sridevi love proposal

Naresh about sridevi love proposal

naresh sridevi love, naresh love story, sridevi proposed by krishna son, krishna son proposed to sridevi

Actor naresh about love proposal to sridevi n childhood.

నరేష్ -శ్రీదేవీ లవ్ ప్రపోజల్ భర్తకు ముందే తెలుసా?

Posted: 07/26/2016 01:00 PM IST
Naresh about sridevi love proposal

అప్పట్లో నటి శ్రీదేవీ అతిలోక సౌందర్యానికి దాసోహం అవని వారంటూ ఎవరూ లేరు. మొత్తం దేశం ఆమెకు అభిమానులు ఉండేవారు. మాములు ఫ్యాన్సే కాదు రాంగోపాల్ వర్మ లాంటి సెలబ్రిటీలు కూడా ఆమె వెర్రి అభిమానుల లిస్ట్ లో ఉండేవారు.  

అయితే ఆ జాబితాలో ఒకడిగా ఉండటమే కాదు ఏకంగా ఆమెకు ప్రపోజ్ చేశాడంట సీనియర్ హీరో నరేష్. విజయనిర్మల తనయుడుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన నరేష్ బాల నటుడి నుంచి సీనియర్ ఆర్టిస్ట్ గా ఎదిగారు. తాజాగా 45 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో తన జీవితంలో ఎదురైన ఈ థ్రిల్లింగ్ న్యూస్ చెప్పాడు. అప్పట్లో శ్రీదేవీ, ఆయన పక్క పక్క ఇంట్లోనే ఉండేవారంట. యుక్త వయసులో ఉండగా ఇద్దరు కలిసి ఒకే ట్యూషన్ కు వెళ్లేవారంట.

ఇలా ఉండగా ఒక రోజు  ఉండబట్టలేక నరేష్ శ్రీదేవికి ఐ లవ్ యూ చెప్పేశాడంట. అయితే అందుకు శ్రీదేవీ నో చెప్పటంతోపాటు, తన అమ్మకి చెబుతానని బెదిరించిందట. భయపడిపోయిన నరేష్ ఆ తర్వాత ఆమెవైపు చూడటమే మానేశాడంట. కట్ చేస్తే... శ్రీదేవీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఓ పంక్షన్ లో నరేష్ కు తారసపడ్డ ఆమె ఆ రోజు సంగతిని గుర్తు చేసిందట. మొగుడు బోనీ కపూర్ పక్కనే ఉండగానే ఆమె ఈ విషయం మాట్లాడటంతో షాక్ తిన్న  నరేష్ కి నోట మాట రాలేదంట.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Naresh  Sridevi  love  proposal  

Other Articles