సావిత్రి బయోపిక్ లో నిత్యామీనన్ | nithya menon in savitri biopic

Nithya menon in savitri biopic

Nithya Menon Savitri's biopic, Veteran Actress Savitri's biopic, Veteran Actress Bio pic, Nithya Menon Savitri biopic, Nithya Menon as Savitri, Nag Aswin Savitri

Nithya Menon in Nag Aswin Veteran Actress Savitri's biopic.

సావిత్రి బయోపిక్ నిజంగా ఒప్పుకుందా?

Posted: 08/16/2016 12:18 PM IST
Nithya menon in savitri biopic

కొందరు పొగరుబోతు అంటారు.. మరికొందరు పక్కా ఫ్రోఫెషనల్ అంటారు. ఎవరేం అంటేనేం తన టాలెంట్ అండ్ యాక్టింగ్ తో వరుస హిట్లు కొడుతూ సౌత్ లో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది నిత్యామీనన్. ఆమె ఉంటే చాలూ చిత్రంలో ఏదో స్టఫ్ ఉందని థియేటర్లకు క్యూ కట్టే జనాలు ఉన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన అవకాశం ఇప్పుడు ఆమెను వెతుకుంటూ వచ్చింది.

అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితంలోని ఉత్థానపతనాలను వెండితెరకు ఎక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించే ఈ చిత్రంలోని టైటిల్ రోల్ కోసం పలువురుని పరిశీలించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను కూడా సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. అయితే, చివరికి నిత్యా మీనన్ ని ఎంచుకున్నట్టు తాజా సమాచారం.

నిత్యా అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలుగుతుందని భావించిన నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించగా, అశ్విన్ నారేషన్ చేసిన విధానం, పైగా సావిత్రి లాంటి మహనటి జీవిత చరిత్ర కావటంతో నిత్యా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ యేడాది చివర్లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  Savitri  biopic  Nag Aswin  

Other Articles