లైంగిక వేధింపులంటూ చీప్ పబ్లిసిటీ చేస్తోంది | criticism on tapsee sexual harrasment comments

Criticism on tapsee sexual harrasment comments

Tapsee sexual harrasment, tapsee cheap publicity, pink actress shocking comments, satire on Tapsee

Tapsee sexual Harrasment comments put her into trouble.

తాప్సీ చీప్ పబ్లిసిటీ ట్రిక్ పై మండిపాటు

Posted: 09/20/2016 09:57 AM IST
Criticism on tapsee sexual harrasment comments

తెలుగులో అవకాశాలు, సక్సెస్ రేటు రెండూ లేకపోవటంతో దుకాణం ఎత్తేసి బాలీవుడ్ లో పాగా వేసింది తాప్సీ పన్ను. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిత్రం పింక్ లో నటించే అవకాశం కాదు, ఏకంగా హిట్ ను అందుకుంది. మూడు రోజుల్లో పాతిక కోట్లు కలెక్ట్ చేసి సన్సేషన్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. కథాబలంతోపాటు, పాత్రలు జీవించటంతో సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్న తాప్సీ చేసిన కామెంట్లపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.
 
యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా సంచలనం కలిగిస్తోంది. తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించింది. అయితే తన నిజజీవితంలో కూడా ఆ బాధితురాలినని చెప్పటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే ఇప్పటివరకూ ఈ విషయాల గురించి నోరు విప్పని ఈ అమ్మడు సినిమా రిలీజ్ అయ్యాక బహిర్గతం చేయడంలో ఆంతర్యం ఏమిటనే భావాన్ని సినీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్లు చెప్పటం ద్వారా చీప్ పబ్లిసిటికి పాల్పడుతుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapsee  sexual harrasment  comments  cheap publicity  

Other Articles