బరువు, బాధ్యతలను అలవోకగా మోస్తోంది | samantha busy in gym workouts

Samantha lifts 75 kgs weight

Samantha busy with social service, samantha 75 kgs weight lifting, samantha gym video, samantha work ous, samantha gym, samantha 2016, actress samantha over lifiting

Samantha busy in Gym workouts and other side did social service.

సమంత భుజాల మీద ఎంత బరువో?

Posted: 11/05/2016 08:27 AM IST
Samantha lifts 75 kgs weight

పార్టీకి లేటుగా వచ్చా అంటూ ఇన్ స్టాగ్రామ్ లో దుకాణం మొదలుపెట్టిన సమంత, అక్కడి నుంచి రోజుకో అప్ డేట్ చొప్పున పెట్టేస్తోంది. ఇక ఇంతకు ముందు ట్విట్టర్ లో శామ్స్ తో టైం స్పెండ్ చేసిన అభిమానులకు మరిచిపోలేని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న ఈ చెన్నై డాల్, ఇక్కడ కూడా అంతకు మించే విషయాలను అందిస్తోంది. పొద్దున్న లేవగానే వర్కవుట్ల దగ్గరి నుంచి రాత్ర పడుకోయే ముందు బెడ్ ఫోటోల దాకా అన్నింటిని పంచుకోవటం అలవాటే కదా.

సో.. అలాగే ఇప్పుడు ఓ వీడియోను షేర్ చేసింది. అది చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టి చూసేస్తున్నారు. అలాగని గ్లామర్ షో ఏం చేయలేదు. షూ.. ట్రాక్ ప్యాంట్.. టీషర్ట్ వేసుకుని.. జస్ట్ జిమ్ లో వర్కవుట్ చేస్తోందంతే. కేవలం వర్కవుట్స్ వీడియోలో కిక్ ఏముంటుంది కదా. అందుకే తనకు మించిన బరువులను మోస్తూ మరోసారి వీడియోను పోస్ట్ చేసింది. చిన్నపాటి డంబెల్స్ కాదు.. ఏకంగా 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్ చేసేసింది. పవర్ గాల్ అంటూ మెసేజ్ ఉంచింది.

 

ఇక కెరీర్‌ ఓపెనింగ్ లో అట్టర్ ఫ్లాపులు ఉన్నప్పటికీ(తమిళ్ లో ఓ రెండు చిత్రాలు చేసింది) టాలీవుడ్ లో దశ తిరగటంతో వరుసబెట్టి సక్సెస్ కొట్టి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఓ పదిహేను రోజులు తన జీవితంలో ఎంతో కీలకమైనవని చెబుతోంది. ‘‘సౌత్ లో హీరోయిన్ గా బిజీగా ఉంటూ పాపులర్‌ అవుతున్న తరుణంలో ఓ పదిహేను రోజులు మంచానపడ్డాను.(సీతమ వాకిట్లో... సినిమా టైంలో ) ఆ పదిహేను రోజుల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. నాకు తెలియని వ్యక్తులు ఆ సమయంలో నాపై చూపించిన ప్రేమ చాలా గొప్పది. జీవితం అంటే ఏంటో పూర్తిగా అప్పుడే తెలుసుకున్నాను. ఏదీ శాశ్వతం కాదని గ్రహించాను. అందరితో ప్రేమానురాగాలతో మెలగాలని అర్థం చేసుకున్నా’’ అంటూ చెప్పుకోచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  samantha gym video  

Other Articles