పెళ్లి చేసుందా? లేక డైరక్ట్ కాపురం చేస్తోందా? | Is Mallika Sherawat secretly married to boyfriend.

Mallika sherawat secretly married

Mallika Sherawat, Mallika Sherawat boy friend, Mallika Sherawat French Man, Mallika Sherawat marriage, Mallika Sherawat Cyrille Auxenfans, Cyrille Auxenfans Girl Friend, Cyrille Auxenfans India, Cyrille Auxenfans Mallika

Mallika Sherawat clears the air "No secret marriage with her French Boyfriend.

మల్లికాపై మళ్లీ మళ్లీ పుకార్లు

Posted: 12/20/2016 07:09 AM IST
Mallika sherawat secretly married

వార్తల కన్నా గాసిప్స్ పేరుతోనే సెలబ్రిటీల యవ్వారాలు ఈ మధ్య రోడ్డెక్కుతున్నాయి. సన్నిహితంగా మెలగటం, ఆపై ఏం లేదంటూ వార్తలను ఖండించటం చూస్తున్నాం. తాజాగా మరో బాలీవుడ్ నటి ఏకంగా సీక్రెట్ పెళ్లి చేసేసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మర్డర్ బోల్డ్ బ్యూటీ మల్లికాషరావత్ తన ఫ్రెంచ్ బాయ్ ఫ్రెండ్ సిరిల్లే అవుక్సన్ ఫ్యాన్స్ ను పెళ్లి చేసుకుందంటూ ఓ జాతీయ మీడియా వార్తను ప్రచురించింది. ఈ మేలో కేన్స్ ఫెస్టివల్ కోసం వెళ్లిన ఇండియాకు తిరిగి రావటం ఇష్టం లేక అక్కడే ఉండిపోయిందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారంటూ కథనాలు ప్రచురించింది.

అయితే తాను రహస్య వివాహం చేసుకున్నానంటూ ఒక ఆంగ్లపత్రికలో వెలువడ్డ కథనంపై బాలీవుడ్ ప్రముఖ నటి మల్లికా షెరావత్ స్పందించింది. ‘దయచేసి వదంతులు ఆపండి.. నేను రహస్య వివాహం చేసుకోలేదు. నా పై అసత్య వార్తలతో కథనాలను ప్రచురించడం తగదు’ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా, ‘మర్డర్’, ‘ద మిత్’, ‘హిస్’, ‘దశావతారం’ వంటి చిత్రాల్లో నటించిన మల్లికా షెరావత్, పలు విదేశీ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు తాను ఇక్కడే ఉన్నానని, బాల్యంలో పిల్లల్ని వేశ్యలు మార్చే అంశంతో తీసిన ఓ డాక్యుమెంటరీ లో కూడా తాను నటించానని చెబుతోంది. ఇంత చెబుతున్నా సిరిల్లే తో తన రిలేషన్ విషయంలో మాత్రం మల్లికా పర్సనల్ అని పేర్కొనటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallika Sherawat  No secret Marriage  Cyrille Auxenfans  

Other Articles