ఒకే హీరో.. నాలుగు అవార్డులు.. రికార్డు బ్రేక్ | Allu Arjun creates new record with supporting role.

One hero four awards for same role

Allu Arjun, Allu Arjun IIFA, IIFA Utsavam 2017, Allu Arjun Awards Function, Allu Arjun Gona Ganna Reddy, Allu Arjun Best Supporting Role, Gona Ganna Reddy 4 Awards, Allu Arjun as Gona Ganna Reddy

Allu Arjun bagged IIFA 2017 best supporting role award for Rudramadevi Movie. Before this Bunny grabs SIIMA, Filmfare and Cine Maa Awards for Same Gona Ganna Reddy Character. With this fourth award Allu Arjun creates new record.

బన్నీ గోన గన్నారెడ్డి కి మరో అవార్డు

Posted: 03/31/2017 12:13 PM IST
One hero four awards for same role

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా చెలామణి అవుతున్న అల్లు అర్జున్ క్రేజ్ నానాటికీ మరింత పెరిగిపోతుంది. టాప్ హీరోలుగా ఉన్న ఆ ఇద్దరి తర్వాత అంతటి రేంజ్ ను తక్కువ సమయంలోనే అందుకున్నాడు బన్నీ. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడుతూ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయాడు. అలాంటి బన్నీ ఇప్పుడు అరుదైన ఓ ఫీట్ ను అందుకున్నాడు.

రీసెంట్ గా ఐషా ఉత్సవం 2017 జరిగాయి కదా. ఈ వేడుకల్లో 2016కు గానూ బెస్ట్ చిత్రాలకు అవార్డులను అందజేశారు. అందులో బెస్ట్ సపోర్టింగ్ రోల్ కు రుద్రమదేవి చిత్రానికిగానూ అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. గోన గన్నారెడ్డిగా గమ్మునుండవోయ్ అంటూ బన్నీ చేసిన సినిమాను ఎంతగా నిలబెట్టిందో తెలిసిందే. అందుకే ఈ అవార్డు దక్కింది. అయితే ఇక్కడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే... సాధారణంగా ఈ మధ్య జరుగుతున్న అవార్డు వేడుకల్లో ఏ ఒక్క కేటగిరీల్లో ఒకే వ్యక్తికి అవార్డులు దక్కటం లేదు.

కానీ, బన్నీ మాత్రం ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి పడేశాడు. ఫిలింఫేర్, సైమా, సినీ మా అవార్డులతో పాటు ఇప్పడు ఐఫాలో కూడా బెస్ట్ సోపోర్టింగ్ రోల్ ను దక్కించుకుని బన్నీ రేర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక అవార్డు వేడుకల్లో ఎన్టీఆర్ తో సహా జనతా గ్యారేజ్ 5 అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. సమంత అ.. ఆ... కు గానూ, బెస్ట్ హీరోయిన్ దక్కించుకుంది. కోలీవుడ్ లో ఇరుది సుట్రు మూడు, విజయ్ తేరి సినిమాకి 3 దక్కాయి. తోజా(తెలుగులో ఊపిరి) చిత్రానికి నాగార్జునకు సపోర్టింగ్ రోల్ అవార్డు దక్కటం విశేషం. కన్నడలో యూటర్న్ సినిమా అవార్డుల పంట పండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Gona Ganna Reddy  Rudramadevi Movie  IIFA Utsavam 2017  Best Supporting Role  

Other Articles