‘బాహుబలి’ సిరీస్ గ్రాండ్ విక్టరీపై చిత్ర యూనిట్ కన్నా దర్శకుడు వర్మే ఎక్కువగా ఎగ్జయిట్ అవుతున్నాడేమో అనిపించకమానదు చేసే ట్వీట్లను చూస్తుంటే. ఓపెనింగ్ డే నుంచి మొదలుకొని బి ఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అంటూ మొదలుపెట్టి రోజు ట్వీట్లు చేస్తూ వార్తల్లో సందడి చేస్తున్నాడు. ఇండియాకు ఓ అవతార్ అంటూ చెప్పుకొచ్చిన వర్మ తర్వాత మళ్లీ కొన్ని ట్వీట్లు చేశాడు. 'బాహుబలి-2 చిత్రాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు వెళుతున్నారు. నాకేమీ ఆశ్చర్యం కల్గించడం లేదు. ఈ సినిమా చూసేందుకు ‘మార్స్’ గ్రహవాసులు తమ స్పేస్ షిప్ లలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని కాస్త అతి ట్వీట్ తోనే వర్మ పేర్కొన్నాడు.
అయితే వోడ్కా మానేశానని, ఇకపై ఎవరినీ హర్ట్ చెయ్యనంటూ మాటిచ్చి తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. దీనికి తోడు కులానికి సంబంధించి ఓ సందేశం పెట్టిన వర్మ ఇతర హీరోలపై సెటైర్ వేసినట్లేనని చెప్పుకుంటున్నారు. ఇంతకీ వర్మ ఏమన్నాడు.. టాలీవుడ్ లో ఇతర హీరోలు కాపులు, కమ్మలపై శ్రద్ధ చూపినట్టుగా ప్రభాస్ తన కులమైన రాజులపైనే దృష్టి పెట్టుంటే ఇంత క్రేజ్ వచ్చేది కాదని రాంగోపాల్ వర్మ చెబుతున్నది.
ప్రభాస్ అలా ఆలోచించలేదు కాబట్టే ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. ఇకపై లోకల్ ఫ్యాన్స్ గురించి ప్రభాస్ ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ప్రభాస్ కు నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారని పేర్కొన్నాడు. లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించే స్టార్స్ ఎప్పుడూ లోకల్ స్టార్స్ గానే మిగిలిపోతారని అన్నాడు. ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడోనని, పంచ్ ఎవరి మీద వేశాడోనని ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు.
If Prabhas concentrated on Rajulu like others did on Kaapulu kammalu etc he would remain regional..he became international because he dint
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2017
Since Prabhas dint care regional fans he got national and international fans .. Stars who care regional fans will always remain regional
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more