Kaala Karikalan Title Was Stolen Case Filed

Case against rajini kaala karikalan

Kaala karikalan Movie, Kaala Title, Rajinikanth Kaala Karikalan Movie, Kaala Karikalan Title, Kaala karikalan Controversy, Kaala Rajinikanth, Kaala Title, Kaala Movie

Rajinikanth's Kaala Karikalan Title Controversy. Kasturi Raja's Assistant Filed Case against Dhanush team.

రజనీ కాలాకు కొత్త కష్టాలు స్టార్ట్

Posted: 05/31/2017 03:00 PM IST
Case against rajini kaala karikalan

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా'  కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కథ తనదేనంటూ కె.రాజశేఖరన్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో 'కరికాలన్' అనే టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించానని... ఈ సినిమాను రజనీతోనే నిర్మించాలని భావించానని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుసుకుని, తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తన సొంత కథతో సినిమాను నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరో విషయం ఏమిటంటే కె.రాజశేఖరన్ అనే వ్యక్తి ఎవరో కాదు... రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తే.

రజనీ కొత్త చిత్రం షూటింగ్ ఆదివారంనాడు ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరి దీనిపై ధనుష్ అండ్ కో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala Karikalan  Rajinikanth Movie  Title Controversy  

Other Articles