Debut Tollywood Hero Died in Road Accident

Tollywood hero died in road accident

Tollywood Debut Hero Died, Hero Aslam Died, Young Hero Death, Telangana Hero Died, Telangana Hero Aslam, Hero Aslma Died, Prema Mayam Movie, Prema Mayam Hero Aslam, Prema Mayam 2017, Premamayam 2017, Premamayam New Movie, Tollywood Aslam

Tollywood Hero Aslam Died in Road Accident at Bibinagar. His Debut Movie Prema Mayam yet to Release.

యాక్సిడెంట్ లో తెలుగు డెబ్యూ హీరో మృతి

Posted: 06/30/2017 10:21 AM IST
Tollywood hero died in road accident

తెలుగు తెరపై తనను తాను హీరోగా చూసుకోవాలనుకున్న ఆ యువకుడి కల చెదిరిపోయింది. వర్ధమాన టాలీవుడ్ హీరో అస్లాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వరంగల్ శివనగర్ కు చెందిన అస్లాం మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాదుకు వచ్చాడు. స్నేహితుల ప్రోత్సాహంతో ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు. ఏడాది క్రితం ప్రేమ మయం అనే ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది.

తన కల నెరవేరే సమయం రావటంతో అస్లాం సంతోషంగా ఫీలయ్యాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో సినిమా విడుదలకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇంతలో మృత్యువు యాక్సిడెంట్ రూపంలో అతన్ని బలి తీసుకుంది. . రంజాన్ కోసం సొంత ఊరికి వెళ్లిన అతను తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయాడు.

తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ కు వస్తుండగా, బీబీనగర్‌ సమీపంలో డివైడర్‌ ను ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయం కావటంతో ఘటనా స్థలంలోనే అస్లాం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తొలి సినిమాను వెండితెరపై చూసుకోకుండానే వెళ్లిపోయాడంటూ స్నేహితులు, చిత్ర యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Hero Aslam  Road Accident  Prema Mayam Movie  

Other Articles