Case filed against actor Santhanam over Assault | సంతానం వర్సెస్ బిల్డర్.. మధ్యలో బీజేపీ నేతకు గాయాలు... పరారీలో కమెడియన్

Case filed against actor santhanam

Actor Santhanam, Santhanam Police Case, Santhanam Builder Fight, Assault Case Top Comedian, Santhanam Absconding, Santhanam Issue

Tamil Actor Santhanam gets injured in fist fight with Chennai builder, police complaint filed against actor The actor had hired the builder for the construction of a mall in Kunrathur.A complaint has now reportedly been launched against Santhanam at the jurisdictional police station by the builder. The Actor in Absconding.

కమెడియన సంతానంపై పోలీస్ కేసు

Posted: 10/11/2017 10:02 AM IST
Case filed against actor santhanam

టాప్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తాజాగా ఆయనపై ఓ కేసు నమోదయ్యింది. సంతానం ఓ బిల్డర్ ఇద్దరూ ఘర్షణకు దిగగా.. మధ్యలో వచ్చిన బీజేపీ నేత ఒకరిని గాయపరచటంతో వారిపై కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో సంతానం పరారీలో ఉన్నాడు.

చౌదరి నగర్ కి చెందిన షణ్ముగసుందరం తో కలసి కుండ్రత్తూర్‌ సమీపంలోని కోవూర్‌ ప్రాంతంలో సంతానం కల్యాణ మండపం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో తన భాగం మొత్తానికి సంబంధించిన డబ్బును నిర్మాణానికి ముందే ఆయనకు సంతానం ఇచ్చేశాడు. అయితే నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో దాని నుంచి ఆయన వైదొలిగాడు. దీంతో కాంట్రాక్టర్ కొంత డబ్బు తిరిగి సంతానంకు చెల్లించాడు. మిగతా మొత్తాన్ని ఎప్పుడు అడిగినా ఇవ్వకుండా తప్పించుకుంటుండడంతో తన మేనేజర్ రమేష్ తో కలిసి సంతానం నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లాడు.

ఈ సమయంలో అక్కడ షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు, న్యాయవాది ప్రేమానంద్‌ కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురూ గాయపడ్డారు.దీంతో వెంటనే నటుడు సంతానం స్థానిక వడపళనిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. అదే ఆసుపత్రిలో షణ్ముగసుందరం కూడా జాయిన్ అయ్యారు. ఇంతలో ప్రేమానంద్ గాయపడ్డాడని తెలుసుకున్న కార్యకర్తలు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం స్థానిక స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేసి, స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంతానంపై మూడు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న సంతానం అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయనను త్వరలో అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. కాగా, ఈ ఘటన కోలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles