టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో బాక్సాఫీసును షేక్ చేసే విధంగా వసూళ్లను రాబబుతూనే వుంది. ఇక ఈ చిత్రం ఇటీవలే అర్థశతదినోత్సవాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని రాములో రాములా పాటలో అల్లు అర్జున్ వేసింది దోసె స్టెప్పు అని క్యూట్ గా చెప్పిన ఆయన తనయ అర్హ.. ఇక తాజాగా తండ్రిని సరదాగా తిట్టేసింది. ఎలాంటి తండ్రైయినా తమ గారాల పట్టి ఎలా పిలిచినా అమెతో సరదాగా అల్లరి చేస్తూ.. వాళ్లూ కూడా చిన్నపిల్లలుగా మారిపోతారు.
ఇక అందులోనూ అల్లు అర్జున్ అయితే మరీనూ.. తన కూతురితో తానున్న ఓ వీడియోను సినిమా అర్థశతదినోత్సవం సందర్భంగా షేర్ చేసిన బన్నీ.. తన కూతురిని ‘బే’ అని పిలిచారు. అది ఏదో మాటల్లో పెట్టి అన్నా.. చిన్నారి కూడా అంతే ముద్దులొలికే మాటలతో తండ్రిని బే అని పిలుస్తున్న ఈ వీడియో క్లైమాక్స్ కూడా అదిరింది. ఆ చిన్నారి ముద్దుముద్దుగా ‘బే’ అని పిలుస్తుంటే బన్నీ మురిసిపోయారు. ఈ వీడియోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘తనే నా బే.. ఫాదర్‌డాటర్‌లవ్, జస్ట్ ఫర్ ఫన్’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అభిమానులు షేర్లు, కామెంట్లతో ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బన్నీకి జంటగా రష్మిక కనిపించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more