Women's Day poster of Vakeel Saab out మహిళా దినోత్సవం: ‘వకీల్ సాబ్’ నుంచి ప్రత్యేక పోస్టర్

Women s day makers of vakeel saab unveil new poster with female stars

vakeel saab, vakeel saab poster, pawan kalyan, Anjali, Nivetha Thomas, Ananya Nagalla, Sriram Venu, Dil Raju, Boney Kapoor, Tollywood, movies, entertainment

On the occasion of International Women’s Day, the makers of Pawan Kalyan starrer upcoming Telugu film Vakeel Saab on Monday unveiled a special poster featuring the three women from the movie. Vakeel Saab is the Telugu remake of Hindi film Pink and stars Pawan Kalyan in the lead. The new poster introduces us to the three female characters from the movie, which are played by Anjali, Nivetha Thomas and Ananya Nagalla.

మహిళా దినోత్సవం: ‘వకీల్ సాబ్’ నుంచి ప్రత్యేక పోస్టర్

Posted: 03/08/2021 04:45 PM IST
Women s day makers of vakeel saab unveil new poster with female stars

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'వ‌కీల్ సాబ్' సినిమా నుంచి అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అల‌రిస్తోంది. వారు ముగ్గురు త‌న‌ వెన‌క నిల‌బ‌డ‌గా మ‌హిళ‌ల‌ను కాపాడే అడ్వకేట్ ‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ లో క‌నప‌డుతున్నారు.

గ‌త ఏడాది మార్చి 8న కూడా మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ సినిమా నుంచి 'మ‌గువా.. మ‌గువా' అనే పాట విడుద‌లైన విష‌యం తెలిసిందే. దాదాపుగా అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా ఇక ప్రీ-రిలీజ్ కోసం రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే నెల (ఏప్రిల్) 9న విడుద‌ల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles