అక్రమాస్తుల కేసులో ఈడీ నుండి నోటీసులు అందుకున్న టీడీపీ పార్టీ నేత చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. ప్రజల్లో మళ్ళీ స్థానం సంపాదించుకోవడం కోసం లక్షకోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ పై కేసు వేయించి తనను ఇరుకున పెట్టాడు. అందులో చంద్రబాబు కొంత వరకు సఫలం అయ్యాడనే చెప్పాలి.ఈ కేసుతో జగన్ పని అయిపొయిందనుకున్న చంద్రబాబుకు జగన్ నీడలా వెంటాడి తనపార్టీ తరుపునుండి తన తల్లి విజయమ్మతో కేసు వేయించడంతో బాబుకు దిమ్మతిరిగిపోయింది. ఈ కేసు ఒక్క చంద్రబాబు పైనే కాకుండా తన బినామీల పేర్లతో ఉన్న వారి పేర్లతో కూడా కేసు వేయించడంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టాయి.
దీంతో తను వేసిన వ్యూహం తనకే బెడిసికొట్టడంతో ఏం చేయాలో తెలియక సతమతమయిన చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం, జగన్ వర్గ ఎమ్మెల్యేల అక్రమాస్తుల పైనే కేసు వేయడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నాయకత్వంతో రాజీ కుదుర్చుకున్న తర్వాత సోనియా, ప్రధానిలని విడిచి తమ పై ఆరోపణలు చేస్తున్న జగన్ ని, కాంగ్రెస్ ఒకే సారి దెబ్బకొట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తుందని సమాచారం.
ఈ ప్రణాళికలో తొలి దశలో జగన్ వర్గం పై, రెండవ దశలో సోనియాగాంధీ పై, మూడవ దశలో కాంగ్రెస్ మంత్రుల పై కేసువేయడానికి చంద్రబాబు సిద్దమయ్యాడని తెలుస్తుంది. ఇప్పటికే సోనియా, ఆమె కుటుంబ సభ్యుల పై విచారణ జరిపించాలంటూ కేసు వేసేందుకు సిద్ధమౌవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కేసును నేరుగా చంద్రబాబు కాకుండా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యలమల రామక్రిష్ణుడిచే వేయించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా వైయస్ హయాంలో పనిచేసిన ప్రభుత్వ సలహాదారు కేవీపీ, వైయస్ వియ్యంకుడు, మంత్రుల పైనే కాకుండా, ప్రస్తుత మంత్రులు బొత్స, సబిత, రఘవీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, శిల్పా మోహన్ రెడ్డి, వంటి వారి పై కూడా కేసు వేయడానికి సిద్ధం అవుతుంది.
ఇంకా వైయస్ హయాంలోని మంత్రులైన కన్నా లక్ష్మినారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంత కుమార్ పై కూడా చంద్రబాబు యలమలతో కేసు వేయించడానికి సిద్ధం అవుతున్నట్లు తెస్తుంది.
‘సన్యాసులు సన్యాసులు రాసుకుంటే బూడిద రాలినట్లు’ అన్న సామెత మాదిరిగా రాజకీయ నాయకులు వారికి వారే ఇలా కేసులు వేసుకుంటే ఎవరు దొంగో, ఎవరు దొరో అనేది తేలుతుందని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more