సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు సతీమణి పద్మ కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. పద్మ గత ఏడాది అక్టోబర్ 28న అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, సినీ నిర్మాతగా, సినీ కార్మికులకు ఆత్మబంధువుగా పేరు ప్రఖ్యాతులు పొందిన పద్మ జ్ఞాపకార్థం ఆమె కాంస్య విగ్రహాన్ని తయారుచేయించిన దాసరి నారాయణరావు, తన జన్మదినం సందర్భంగా స్వయంగా తన చేతులు మీదుగానే దాన్ని ఆవిష్కరించారు.
ఇదే సందర్భంగా నిరుడు తాను నెలకొల్పిన నీడ చారిటబుల్ ట్రస్ట్ తరపున 25 మంది పేద, అనాథ విద్యార్థినీ విద్యార్థులకు రూ. 2 లక్షల మేరకు స్కాలర్ షిప్సులు అందజేశారు. ఈ సంగతిని దాసరి తరపున దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, రేలంగి నరసింహారావు తెలిపారు. అర్ధాంగి పద్మ మరణించి ఇంకా ఏడాది కాకపోవడంతో ఈసారి జన్మదిన వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయించిన దాసరి ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. అయినప్పటికీ సినీ రంగంలోని అనేకమంది ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు, శిష్యులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. దాంతో ఆర్భాటం లేకుండా వారి అభినందనలు స్వీకరించారు దాసరి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more