సీఎం కిరణ్ కు ఢిల్లి లో పడిన అక్షింతలు ఫలితం ఇప్పుడు బాగా కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొన్నటివరకు మన్ను తిన్న పాములా ఉన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఒక్కసారిగా జగన్ పై పడగవిప్పడటంతో.. కాంగ్రెస్ నాయకులు సీఎం చేసిన విమర్శలు పటపంచలు అవుతున్నాయాని కిరణ్ సన్నిహితులు అంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో జగన్ పై ముఖ్యమంత్రి కిరణ్ నోరు భారీ రేంజ్ లో పెంచినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా పెంచటం వెనక రహస్యం ఉందని అంటున్నారు. ఈవిదంగానైన ఢిల్లీ లో ఉన్న అమ్మకు తనపై మంచి అభిప్రాయం కలుగుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. గెలుపు , ఓటములు పక్కనబెడితే.. సీఎం మాత్రం జగన్ పై రెచ్చిపోవటంత చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అంటున్నారు.
ఉప ఎన్నికలు సమీపి స్తున్న కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌పై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శ లను పదును పెడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల మనోధైర్యం పెంచేదిశగా సిఎం ప్రచార సభల్లో ప్రసంగి స్తున్నారు. జగన్ కోవర్టు సిఎం కిరణ్ అని సొంత పార్టీలోని కొందరు నేతలు చేసిన విమర్శలకు చెక్‌పెట్టే విధంగా నల్లారి విమర్శలలో వేడిపెంచుతున్నారు. ఎక్కడా అసందర్బ విమర్శలకు తావ్వికుండా జాగ్రత్తలు తీసుకొంటూ సిఎంగా తన హుందాను చాటు కొంటున్నారు. వై.ఎస్.జగన్ నుంచి వస్తున్న ప్రతి విమర్శపై స్పందిస్తూ వాటికి తగినరీతిలో ప్రతివిమర్శ ద్వారా సమాధానం ఇస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి నూతన జలసత్వాలు నింపేందుకు యత్నిస్తున్నారు. వివిధ సందర్భాలలో ఆయన చేసిన వ్యాఖ్యనాలను ఓ సారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘నిన్న, మొన్నటి వరకు జగన్ అర్థిక నేరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు నేరగాళ్లతో, అరాచక శక్తులతో, కబ్జాదారులతో ఆయనకు సంబంధాలున్నట్లు తేలుతోంది, ఇలాంటి వారికి అధికారం ఇస్తే ప్రజలనే కాదు, రాష్ట్రాన్ని ఖూనీ చేస్తారు. తల్చుకోగానే తాతకు పెళ్లి కావాలన్నట్లు అనుకున్నదే తడువుగా సిఎం కావాలని జగన్ భావిస్తున్నారు‘‘ తిరుపతి సభలో కిరణ్ ఇలా నిప్పులు చెరిగారు.‘‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారు. హైదరాబాద్, బెంగుళూరులో 70 నుంచి 80 పడకల భవనాన్ని నిర్మించుకొన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రజాజీవితానికి పనికివస్తాడా, ఆయన ప్రజాజీవితానికి అనర్హుడు.’’ అని ఉభయ గోదావరిజిల్లాల పర్యటనలో సిఎం నిప్పులు చెరిగారు.‘‘కెసిఆర్, చంద్రబాబులతో జగన్ కుమ్మక్కయ్యారు. తన తండ్రి నిత్యం వ్యతిరేకించే చంద్రబాబుతో జగన్ అవిశ్వాస తీర్మానంలో ఓటువేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు.తండ్రి ఆత్మక్షోభించేలా చేశాడు’’ అంటూ పాయకరావుపేట, నర్సన్నపేటలో కిరణ్ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
‘‘ చిన్న వయస్సులో వై.ఎస్.ను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా చేసింది. రెండు సార్లు సిఎల్‌పి నేతగా, రెండు సార్లు సిఎంగా అవకాశం ఇచ్చింది. సోనియా ఆదేశం మేరకే 2009లో వై.ఎస్.ను ఏకగ్రీవంగా సిఎం ఎమ్మెల్యేలంతా ఎన్నుకొన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను, సోనియాను విమర్శించడం అంటే వై.ఎస్.ను విమర్శించడమే అవుతుంది. వై.ఎస్. కొడుకు కాకపోయివుంటే జగన్ ఏమిటి.’’ అని రాయచోటిలో ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు.‘‘వై.ఎస్.కంటే నా తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి రాజకీయాలలో సీనియర్. రాజారెడ్డి జైలులో ఉంటే నా తండ్రియే ఆయన్ని విడిపించుకొని వచ్చారు’’ అంటూ కడపజిల్లా చిట్వేలిలో జగన్‌పై కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శలను పదునుపెట్టారు. జగన్‌పై ఎదురుదాడి చేసే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలకు తావివ్వకుండా జాగ్రత్తలను తీసుకొంటున్నారు. సందర్భోచితంగా జగన్‌పై వస్తున్న ఆరోపణలను ఆయుధంగా మల్చుకొంటున్నారు. జగన్‌తో తనకు సంబంధాలున్నాయని మంగళి కృష్ణతో మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్‌కు అరాచకశక్తులతో సంబంధాలున్నాయని తేలియవచ్చిందని కిరణ్ తన విమర్శలను పదును పెట్టారు. ఎక్కడా ఆయన విమర్శలలో వివాదాలకు తావివ్వకుండా, జగన్‌కు ప్రతిదాడిచేసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
జగన్‌ను ఎదుర్కొవడం కష్టమేనన్న భావనలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మాత్రం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కు మార్‌రెడ్డి వ్యాఖ్యలు టానిక్‌గా పనిచేస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్‌పై స్వయంగా కిరణ్‌కుమార్‌రెడ్డియే ఎదురుదాడికి దిగడంతో పార్టీ శ్రేణులలో నూతన జవసత్వాలు నింపినట్లయిందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యనించారు. అదే సందర్భంలో తన వ్యాఖ్యనాల ద్వారా జగన్‌కు ధీటుగా తానున్నాన్న సంకేతాలు సిఎం కిరణ్ పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ పంపగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more