పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కడపకు వచ్చినప్పుడు వివేకాకు గుర్తింపునివ్వడం లేదని... ఇలా అయితే పులివెందులలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని ఆయన వర్గీయులు లోగడ హెచ్చరించిన సంగతి తెలిసిందే. నలువైపుల దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న వైఎస్ జగన్‌ను ఆయన బాబాయి వివేకానందరెడ్డి బాసటగా నిలవనున్నారా? వివేకా కాంగ్రెస్‌ను వీడి జగన్‌పార్టీ పంచన చేరనున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. తన ముఖ్య అనుచరులతో పులివెందులలో వివేకా అత్యవసరంగా స మావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక నిర్ణయాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. దీనితోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని పరిణామాలతో కాంగ్రెస్‌లో కొనసాగడంపై వివేకా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోం ది. తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 23న వివేకా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని, ఆరోజు వీలుపడని పక్షంలో 28న ప్రకటిస్తారని తెలుస్తోంది.
మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి అబ్బాయ్ వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన అబ్బాయ్, బాబాయ్ మధ్య భేటీకి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా వైయస్ వివేకానంద రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డితో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు మార్లు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ ఒక్కటవుతారనే ప్రచారం కడప జిల్లాలో జోరందుకుంది. ఇందుకు అనుగుణంగానే వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై సిబిఐ, ప్రభుత్వ చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి మూతపడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి వల్ల కాంగ్రెసుకు సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు.
కాగా, కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వైయస్ వివేకానంద రెడ్డి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభల్లో మాత్రం ఆయన మొక్కుబడిగా పాల్గొన్నారు. ఆ తర్వాత అటు వైపు కూడా చూడడం లేదు. కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్ విజయమ్మపై ఓటమి పాలైన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు కోసం ఆయన చేసిన తీవ్ర ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
కడప జిల్లా ఉప ఎన్నికల్లోని నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారులో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని పట్టించుకోలేదని అంటున్నారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం సాగించిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెసు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, అధిష్టానం సూచనతో తాత్కాలికంగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై సమరానికి తెర దించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, వైయస్ వివేకానంద రెడ్డి అబ్బాయ్ వైపు చూస్తున్నట్లు మాత్రం కడప జిల్లాలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more