రాష్ట్రంలో ఆరు నెలలుగా ఉత్కంఠను రేపుతున్న మద్యం సిండికేట్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈనెల 18, 19, 20తేదీలలో విచారణకు హాజరు కావాలంటూ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఏసీబీ తాఖీదులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. వీరు కాక మంత్రి ధర్మాన కుమారుడు రాంమనోహర్ నాయుడు అలియాస్ చిన్నా, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ యంయల్ సి పువ్వాడ నాగేశ్వర్ రావులకు కూడా ఏసీబీ నోటీసులిచ్చింది. తాఖీలందుకున్న నేతలలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందినవారు ఉన్నారు.
2011 డిసెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలుపెట్టింది. తరువాత మద్యం సిండికేట్ల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఎర్పాటు చేస్తూ దానికి సీనియర్ ఐపియస్ అధికారి శ్రీనివాస రెడ్డిని ఇన్ చార్జిగా నియమించింది. 2012 ఫిబ్రవరి 7న ఖమ్మంకు చెందిన మద్యం వ్యాపారి నున్నా రమణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రాష్ట్రమంత్రి మోపిదేవి వెంటకరమణకు 10లక్షల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు నున్నా విచారణలో తెలిపాడని రిమాండ్ రిపోర్టును కోర్టులో ఏసీబీ సమర్పించింది.ఎమ్మెల్యేలకు, ఎక్సైజ్ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పినట్లు నున్నా రమణ విచారణలో తెలిపాడని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ తెలిపింది. కొన్ని రోజుల తరువాత ఎసిబి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లు, బినామీలతో పాటు వారికి సహాకరించిన ఎక్సైజ్ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. అయితే ప్రభుత్వం హఠాత్తుగా ఎప్రిల్ 3న సిట్ చీప్ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్రిల్ 16న మధ్యంతర నివేదికను హైకోర్టుకు ఎసిబి అందజేసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ డ్డి బదిలీపై ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బదిలీపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇకపై సిట్ లో పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం సిండికేట్ల వ్యవహారంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరులకు జిల్లాల్లో పెద్దసంఖ్యలో వైన్ షాపులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. సిండికేట్ల వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టేదిలేదంటూ ఏసీబీ అదనపు డీజీ బూబతిబాబు ప్రకటించారు. అదే సందర్భంలో ప్రభుత్వం పదోన్నతిపై ఎసిబి డిజిగా ప్రసాద్ రావును నియమించింది. బూబతిబాబు దూకుడు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆయన పై అధికారిగా ప్రసాద్ రావును నియమించారని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రతి జిల్లాలో దాదాపు యాభైశాతం మద్యం షాపులు తెల్లరేషన్ కార్డుదారుల పేరిట ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిలో చాలామంది ప్రజాప్రతినిధులకు బినామీలన్న విషయం విచారణలో తేలింది. మరో 18మందికి త్వరలో నోటీసులిచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తం 120మందికిపైగా ఎమ్మెల్యేలకు లిక్కర్ సిండికేట్లతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నట్టుగా ఎసిబి విచారణలో తేలడం అన్ని పార్టీల నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జూన్ 11న ఏసీబీ అధికారులు మరోసారి న్యాయస్థానానికి సమర్పించనున్న నివేదికలో తమలో ఎవరెవరి జాతకాలు బయటపడతాయోనని, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజాప్రతినిధులు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more